Bhairavam Day 2 Box Office Collections: బైరవం 2వ రోజు కలెక్షన్లు.. ఎన్ని కోట్లో తెలుసా?

యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంచు హీరోలుగా, అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం భైరవం. తమిళంలో ఘన విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందింది. సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలో నటించారు. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. నిర్మాత కేకే రాధా మోహన్ నిర్మించారు. మే 30న విడుదలైన ఈ చిత్రం బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బాక్సాఫీస్ వసూళ్ల వివరాలు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాల్లోకి వెళితే..

భైరవం చిత్రం బడ్జెట్ ఎంత? (Bhairavam Movie Budget?)
మాస్, యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా రూపొందిన భైరవం సినిమాను డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పించగా.. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌, పెన్ స్టూడియోస్‌ బ్యానర్లపై రూపొంచారు. ఈ సినిమాలో భారీగా తారాగణం, టాప్ టెక్నిషియన్స్ పనిచేయడంతో భారీ ఖర్చైంది. నిర్మాణ ఖర్చులు, రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్ తో కలిపి మొత్తంగా రూ.35 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Bhairavam Day 2 Box Office Collections Worldwide

భైరవం మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ (Bhairavam Pre Release Business)..
తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ ను జోరుగానే నిర్వహించారు. దాంతో సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ రూ.6 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ రూ.7.5 కోట్లు వసూలైంది. తెలుగు రాష్ట్రాల రైట్స్ కు సుమారుగా రూ.16 కోట్ల మేర వ్యాపారం జరిగింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు రూ.1.5 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ.1.5 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇలా ప్రపంచం వ్యాప్తంగా రూ.19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్..
ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల రూపాయల షేర్.. 40 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. ప్రస్తుతం భైరవం చిత్రం టాక్ మిశ్రమంగా ఉండటంతో లాంగ్ రన్ లో ఏమేరకు వసూళ్లు చేస్తుందనే ఆసక్తికరంగా మారింది.

2 రోజుల వసూళ్లు..
భైరవం చిత్రానికి తొలి రోజు మిక్స్డ్ టాక్ రావడంతో థియేటర్ ఆక్యుపెన్సీ గరిష్ఠంగా 40 శాతంగా మాత్రమే నమోదైంది. ఇక 2వ రోజు ఓవరాల్ గా 25 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసుకుందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక మొదటి రోజు భైరవం చిత్రానికి రూ.2.6 కోట్ల ఇండియా నెట్, రూ.3 కోట్ల ఇండియా గ్రాస్, ఓవర్సీస్ లో రూ.0.5 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇలా మొత్తంగా ఓపెనింగ్ డే రూ.3.5 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. ఇక 2వ రోజు వసూళ్ల విషయానికొస్తే ఏర్లీ ఎస్టిమేట్స్ ప్రకారం.. రూ.2.5 కోట్ల వరకు ఇండియా నెట్ వసూల్ చేసిందని చెబుతున్నారు. వీకెండ్ కావడంతో పూర్తి వసూళ్లతో కలిపి వరల్డ్ వైడ్ గా రూ.3 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2 రోజుల్లో ఈ చిత్రం మొత్తంగా 6 నుంచి 8 కోట్ల వరకు సంపాదించిందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X