Bhairavam Day 4 Collection: బెల్లంకొండ ముందు భారీ టార్గెట్.. ఈ కలెక్షన్స్‌తో కష్టమే.. 4వ రోజు ఎన్ని కోట్లంటే?
బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంచు హీరోలుగా, అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించిన మూవీ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించగా జయసుధ కీలకపాత్ర పోషించగా.. కేకే రాధా మోహన్ నిర్మాణం వహించారు. మే 30న విడుదలైన బైరవం చిత్రం బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బాక్సాఫీస్ వసూళ్ల వివరాలు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాల్లోకి వెళితే..
భైరవం చిత్రం బడ్జెట్ ఎంత?
పెన్ స్టూడియెస్ డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ భైరవం చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్ తో కలిపి బైరవం చిత్రాన్ని మొత్తంగా రూ.35 కోట్ల బడ్జెజ్‌తో నిర్మించారు.

భైరవం మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్
టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో భైరవం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మంచు మనోజ్ అంతా తానై ప్రమోషనల్ కార్యక్రమాలను నడిపిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు థియేట్రికల్ నబిజినెస్ కూడా బాగానే జరిగినట్లు ఫిలింనగర్ టాక్. నైజాంలో రూ.6 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఆంధ్రలో రూ.7.50 కోట్లు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ.2.2 కోట్లు చొప్పున భైరవం చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.19 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలాగే భైరవం ఓటీటీ రైట్స్ కూడా భారీ ధర పలికినట్లు ఫిలింనగర్ టాక్. భైరవం డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను జీ 5 సంస్థ రూ.32 కోట్లు వెచ్చించి దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
బ్రేక్ ఈవెన్ టార్గెట్..
ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల రూపాయల షేర్.. 40 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. ప్రస్తుతం భైరవం చిత్రానికి మిక్స్‌డ్ టాక్ కారణంగా ఈ సినిమా ఏ మేరకు ఒడ్డున పడుతుందో వేచి చూడాలి.
భైరవం మూడు రోజుల వసూళ్లు
బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు ఇండియాలో రోజు రూ.2.6 కోట్ల ఓపెన్సింగ్ రాగా.. రెండో రోజు రూ.2.4 కోట్లు, మూడో రోజు రూ.2.4 కోట్లు చొప్పున మూడు రోజుల్లో రూ.7.40 కోట్ల నికర వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. అటు ఓవర్సీస్‌లోనూ భైరవంకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో రూ.55 లక్షల మేర ఈ చిత్రం రాబట్టినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది.
భైరవం నాలుగో రోజు కలెక్షన్స్
నాలుగో రోజు వర్కింగ్ డే అయినప్పటికీ భైరవం మూవీ బుకింగ్స్‌లో మంచి హోల్డ్ సాధించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సోమవారం నాడు ఈ సినిమా ఓవరాల్‌గా 17.39 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదు చేసినట్లుగా సాక్‌నిల్క్ తెలిపింది. నాలుగో రోజు ఈ సినిమా ఇండియాలో నికరంగా రూ.1.25 కోట్లు రాబట్టింది. దీంతో నాటుగు రోజుల వరకు బైరవం ఇండియా వైడ్‌గా రూ.8.65 కోట్ల నెట్, రూ.8.45 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి భైరవం చిత్రం నాలుగు రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.9 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా రూ.31 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకోవాల్సి ఉంది. మరి ముగ్గురు హీరోలు ఎలాంటి మేజిక్ చేస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











