Bhairavam Day 5 Collection: దారుణంగా భైరవం కలెక్షన్స్.. మంచు మనోజ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
హిట్స్ లేక సతమతం అవుతున్నారు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంచు. ఈ ముగ్గురూ హీరోలుగా అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించిన మూవీ భైరవం. విజయ్ కనకమేడల దర్శకుడు. మే 30న విడుదలైన బైరవం చిత్రం స్లో అండ్ స్టడీగా వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ చిత్రం రాబట్టిన వసూళ్లు? బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు ఇంకెంత రాబట్టాలి? తదితర వివరాలు చూస్తే..
భైరవం చిత్రం బడ్జెట్ ఎంత?
పెన్ స్టూడియెస్ డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ భైరవం చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి బైరవం చిత్రాన్ని మొత్తంగా రూ.35 కోట్ల బడ్జెజ్‌తో నిర్మించారు.

భైరవం ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
టీజర్, ట్రైలర్, చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలతో భైరవం సినిమాకు చిత్ర సీమలో మంచి బజ్ ఏర్పడింది. తద్వారా ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నైజాంలో రూ.6 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఆంధ్రలో రూ.7.50 కోట్లు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ.2.2 కోట్లు చొప్పున భైరవం చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.19 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలాగే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను జీ 5 సంస్థ రూ.32 కోట్లు వెచ్చించి దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ మల్టీస్టారర్ చిత్రం లాభాల్లోకి రావాలంటే.. 20 కోట్ల రూపాయల షేర్.. 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
భైరవం నాలుగు రోజుల వసూళ్లు
బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు ఇండియాలో రోజు రూ.2.6 కోట్ల ఓపెన్సింగ్ రాగా.. రెండో రోజు రూ.2.4 కోట్లు, మూడో రోజు రూ.2.4 కోట్లు, నాలుగో రోజున రూ.1.21 కోట్లు చొప్పున నాలుగు రోజుల్లో రూ.8.65 కోట్ల నికర వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఈ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మిక్స్‌డ్ టాక్ కారణంగా ఓవర్సీస్‌లోనూ అంతంత మాత్రంగానే వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఓవర్సీస్ మార్కెట్‌లో భైరవం చిత్రం రూ.55 లక్షల మేర వసూళ్లు అందుకున్నట్లు సాక్‌నిల్క్ తెలిపింది.
భైరవం ఐదో రోజు కలెక్షన్స్
ఐదో రోజు భైరవం మూవీ బుకింగ్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. మంగళవారం నాడు ఈ సినిమా ఓవరాల్‌గా 13.76 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదు చేసినట్లుగా సాక్‌నిల్క్ తెలిపింది. హైదరాబాద్‌లో 334, బెంగళూరులో 236, విజయవాడలో 86, విశాఖలో 89 షోలు ప్రదర్శించబడినట్లు వెల్లడించింది. ఐదో రోజు భైరవం సినిమా ఇండియాలో నికరంగా 69 లక్షల రూపాయలు రాబట్టినట్లు పేర్కొంది. దీంతో ఐదు రోజుల వరకు భైరవం ఇండియా వైడ్‌గా రూ.8.65 కోట్ల నెట్, రూ.9.03 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది.
ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి భైరవం చిత్రం ఐదు రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.10.20 కోట్లు ఆర్జించింది. ముగ్గురు హీరోల మల్టీస్టారర్ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకోవాల్సి ఉంది. ఈ వారం కమల్ హాసన్- మణిరత్నంల థగ్‌లైఫ్ రిలీజ్ కానుండటంతో గట్టి పోటీ ఎదరయ్యే అవకాశం ఉంది. మరి భైరవం చిత్రం ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











