Bhairavam Day 6 Collection: చేతులెత్తేసిన ముగ్గురు స్టార్స్.. షాకిచ్చేలా వసూళ్లు.. భైరవం హిట్ కొట్టాలంటే?

విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంచు నటించిన మల్టీస్టారర్ చిత్రం భైరవం. అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించగా.. జయసుధ కీలకపాత్రలో కనిపించారు. మే 30న విడుదలైన బైరవం చిత్రం కలెక్షన్స్ మొదటి వారం బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం పడిపోతున్నాయి. వరుసగా రెండో రోజూ వసూళ్లు డ్రాప్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు భైరవం చిత్రం రాబట్టిన వసూళ్లు? బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ కొట్టాలంటే ఇంకెంత రాబట్టాలి? తదితర వివరాలు చూస్తే..

భైరవం చిత్రం బడ్జెట్ ఎంత?
పెన్ స్టూడియెస్‌ డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ భైరవం చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి బైరవం చిత్రాన్ని మొత్తంగా రూ.35 కోట్ల బడ్జెజ్‌తో నిర్మించారు.

Bhairavam Day 6 Box Office Collections Worldwide Manoj s movie sees low collections for second consecutive day

భైరవం ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్

మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్‌లు ప్రమోషనల్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా కష్టపడ్డారు. దీంతో భైరవం సినిమాకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ వచ్చింది. తద్వారా ఈ మల్టీస్టారర్ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వైడ్‌గా థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నైజాంలో రూ.6 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఆంధ్రలో రూ.7.50 కోట్లు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ.2.2 కోట్లు చొప్పున భైరవం చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.19 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలాగే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను జీ 5 సంస్థ రూ.32 కోట్లు వెచ్చించి దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భైరవం సినిమా లాభాల్లోకి రావాలంటే.. 20 కోట్ల రూపాయల షేర్.. 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

భైరవం ఐదు రోజుల వసూళ్లు

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు ఇండియాలో రోజు రూ.2.6 కోట్ల ఓపెన్సింగ్ రాగా.. రెండో రోజు రూ.2.4 కోట్లు, మూడో రోజు రూ.2.4 కోట్లు, నాలుగో రోజున రూ.1.21 కోట్లు, ఐదో రోజున రూ.69 లక్షల చొప్పున ఐదు రోజుల్లో రూ.9 కోట్ల నికర వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఓవర్సీస్‌లో తొలి వారం మంచి వసూళ్లు రాబట్టిన భైరవంకు అక్కడా ఆదరణ కరువైంది. ఇప్పటి వరకు ఓవర్సీస్‌ మార్కెట్‌లో భైరవం చిత్రం రూ.55 లక్షల మేర వసూళ్లు అందుకున్నట్లు సాక్‌నిల్క్ తెలిపింది.

భైరవం ఆరో రోజు కలెక్షన్స్

ఆరో రోజు కూడా భైరవం మూవీ కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. బుధవారం నాడు ఈ సినిమా ఓవరాల్‌గా 12.14 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదు చేసినట్లుగా సాక్‌నిల్క్ తెలిపింది. హైదరాబాద్‌లో 336, బెంగళూరులో 207, విజయవాడలో 86, విశాఖలో 84 షోలు ప్రదర్శించబడినట్లు వెల్లడించింది. ఆరో రోజు భైరవం సినిమా ఇండియాలో నికరంగా 53 లక్షల రూపాయలు మాత్రమే రాబట్టి వరుసగా రెండో రోజు నిరాశపరిచింది. దీంతో ఆరు రోజుల వరకు భైరవం ఇండియా వైడ్‌గా రూ.9.31 కోట్ల నెట్, రూ.10.70 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి భైరవం చిత్రం ఐదు రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.11.25 కోట్లు ఆర్జించింది.

భైరవం చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా రూ.28 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకోవాల్సి ఉంది. గురువారం కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ థగ్‌లైఫ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా భైరవం రన్ కష్టమే. మరి రాబోయే రోజుల్లో మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్‌లు ఎలాంటి మేజిక్ చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X