Bhairavam Day 7 Collection: మంచు మనోజ్‌ని దెబ్బకొట్టిన కమల్.. దారుణంగా భైరవం కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?
హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ముగ్గురు హీరోలు నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన చిత్రమే భైరవం. ఈ ముగ్గురిలో మంచు మనోజే ప్రత్యేక ఆకర్షణ. కుటుంబంలో గొడవలతో చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్ తిరిగి నటించడంతో బైరవం చిత్రానికి హైప్ వచ్చింది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించగా.. జయసుధ కీలకపాత్రలో కనిపించారు. మే 30న విడుదలైన బైరవం చిత్రం థియేట్రికల్ రన్ దాదాపుగా ముగింపు స్టేజ్‌కు వచ్చేసింది.
భైరవం చిత్రం బడ్జెట్ ఎంత?
పెన్ స్టూడియెస్ డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ భైరవం చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి బైరవం చిత్రాన్ని మొత్తంగా రూ.35 కోట్ల బడ్జెజ్‌తో నిర్మించారు.

భైరవం ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
భారీ ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలు, టీజర్, ట్రైలర్ల కారణంగా భైరవం సినిమాకు థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నైజాంలో రూ.6 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఆంధ్రలో రూ.7.50 కోట్లు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ.2.2 కోట్లు చొప్పున భైరవం చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.19 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలాగే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను జీ 5 సంస్థ రూ.32 కోట్లు వెచ్చించి దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భైరవం సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 20 కోట్ల రూపాయల షేర్.. 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
భైరవం ఆరు రోజుల వసూళ్లు
ఈ మల్టీస్టారర్ చిత్రానికి ఇండియాలో తొలిరోజు రూ.2.6 కోట్ల ఓపెన్సింగ్ రాగా.. రెండో రోజు రూ.2.4 కోట్లు, మూడో రోజు రూ.2.4 కోట్లు, నాలుగో రోజున రూ.1.21 కోట్లు, ఐదో రోజున రూ.69 లక్షలు, ఆరో రోజున రూ.53 లక్షల చొప్పున ఆరు రోజుల్లో రూ.9.31 కోట్ల నికర వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఓవర్సీస్‌లో భైరవం చిత్రం రూ.55 లక్షల కలెక్షన్స్ అందుకుంది.
భైరవం ఏడో రోజు కలెక్షన్స్
ఆదివారం వరకు మంచి హోల్డ్ సాధించిన భైరవం చిత్రం.. సోమవారం ఫర్వాలేదని అనిపించుకున్నప్పటికీ మంగళవారం నుంచి మాత్రం కలెక్షన్స్ కోల్పోతూ వచ్చింది. కనీసం రోజుకు రూ.కోటి కూడా వసూలు చేయలేక ఆపసోపాలు పడింది. ఈలోపు జూన్ 5న కమల్ హాసన్ - మణిరత్నం భారీ బడ్జెట్ చిత్రం థగ్‌లైఫ్ రిలీజ్ కావడంతో భైరవంపై దెబ్బకొట్టింది. ఇక ఏడో రోజు మంచు మనోజ్- బెల్లంకొండ శీనుల సినిమా ఎంత మేరకు కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే.
గురువారం భైరవం చిత్రానికి ఓవరాల్‌గా 12.44 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 284, బెంగళూరులో 334, విజయవాడలో 75, విశాఖలో 81 షోలు చొప్పున ప్రదర్శితమయ్యాయి. ఏడో రోజు భైరవం సినిమాకు ఇండియా వైడ్‌గా రూ.33 లక్షల నికర వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా రిలీజైన నాటి నుంచి రూ.50 లక్షల లోపు కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి. తద్వారా ఏడు రోజుల వరకు ఇండియాలో రూ.10.16 కోట్ల నెట్, రూ.11.59 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ కలెక్షన్స్ + ఇండియాలో వచ్చిన గ్రాస్ కలిపి ఇప్పటి వరకు భైరవం చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.12.14 కోట్ల కలెక్షన్స్ అందుకుంది.
ఈ వసూళ్లతో ఇప్పటి వరకు బడ్జెట్‌లో 50 శాతాన్ని భైరవం రికవరీ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయిత కలెక్షన్స్ దారుణంగా పడిపోవడంతో ఈ వారంతో మంచు మనోజ్ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసినట్లేనని అంచనా వేస్తున్నారు. థగ్‌లైఫ్‌కి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ కమల్ హాసన్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో భైరవంపై దెబ్బ పడినట్లుగా భావిస్తున్నారు. ఈ వీకెండ్‌పై భైరవం యూనిట్ ఎన్నో అంచనాలు పెట్టుకుంది. మరి ఈ ముగ్గురు హీరోలు ఎలాంటి మేజిక్ చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











