Bhairavam Day 8 Collection: ట్రాక్‌లోకి భైరవం.. బెల్లంకొండ శ్రీనివాస్ మూవీకి కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ముగ్గురు హీరోలు చేసిన ప్రయత్నం నిరాశ కలిగించేలా ఉంది. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన బైరవం చిత్రం పెట్టిన పెట్టుబడితో కేవలం 50 శాతం మాత్రమే రికవరి చేయడం, త్వరలో పెద్ద సినిమాలు ఉండటంతో వారి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల్లో ఈ సినిమా తన థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 8వ రోజు భైరవం చిత్రం ఎన్ని కోట్లు రాబట్టింది? బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ సినిమా ఇంకెంత వసూలు చేయాలో చూస్తే.
భైరవం చిత్రం బడ్జెట్ ఎంత?
విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించగా.. జయసుధ కీలకపాత్రలో కనిపించారు. పెన్ స్టూడియెస్ డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ భైరవం చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి బైరవం చిత్రాన్ని మొత్తంగా రూ.35 కోట్ల బడ్జెజ్‌తో నిర్మించారు. మే 30న ఈ సినిమా విడుదలైంది.

భైరవం ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
ప్రమోషనల్ కార్యక్రమాలు, టీజర్, ట్రైలర్ల కారణంగా భైరవం సినిమాకు మంచి హైప్ రావడంతో థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నైజాంలో రూ.6 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఆంధ్రలో రూ.7.50 కోట్లు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ.2.2 కోట్లు చొప్పున భైరవం చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.19 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలాగే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను జీ 5 సంస్థ రూ.32 కోట్లు వెచ్చించి దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భైరవం సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 20 కోట్ల రూపాయల షేర్.. 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
భైరవం ఏడు రోజుల వసూళ్లు
ఈ మల్టీస్టారర్ చిత్రానికి ఇండియాలో తొలిరోజు రూ.2.6 కోట్ల ఓపెన్సింగ్ రాగా.. రెండో రోజు రూ.2.4 కోట్లు, మూడో రోజు రూ.2.4 కోట్లు, నాలుగో రోజున రూ.1.21 కోట్లు, ఐదో రోజున రూ.69 లక్షలు, ఆరో రోజున రూ.53 లక్షలు, ఏడో రోజున రూ.40 లక్షల చొప్పున తొలి వారం ఈ సినిమా రూ.10.23 కోట్ల నికర వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఓవర్సీస్‌లో భైరవం చిత్రం రూ.55 లక్షల కలెక్షన్స్ అందుకుంది.
భైరవం 8వ రోజు కలెక్షన్స్
తొలి నాలుగు రోజుల్లో భైరవం చిత్రానికి రోజుకు రూ.కోటి తక్కువ కాకుండా వసూళ్లు రాగా.. ఐదవ రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వచ్చాయి. కమల్ హాసన్ థగ్‌లైఫ్ రిలీజ్ కావడంతో ఇక ఏమాత్రం భైరవం పుంజుకోలేకపోయింది. 8వ రోజైన శుక్రవారం 16.91 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 177, బెంగళూరులో 89, విజయవాడలో 49, విశాఖలో 75 చొప్పున షోలు ప్రదర్శితమయ్యాయి.
8వ రోజు భైరవం సినిమాకు ఇండియా వైడ్‌గా రూ.52 లక్షల నికర వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. తద్వారా 8 రోజుల వరకు ఇండియాలో రూ.10.75 కోట్ల నెట్, రూ.12 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ కలెక్షన్స్ + ఇండియాలో వచ్చిన గ్రాస్ కలిపి ఇప్పటి వరకు భైరవం చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.13 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. గడిచిన కొద్దిరోజులుగా కలెక్షన్స్‌ను కోల్పోతుండటంతో ఈ వీకెండ్‌పై చిత్ర యూనిట్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ వారాంతం తర్వాత భైరవం మూవీ థియేట్రికల్ రన్‌పై ఓ క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











