Bhairavam Day 9 Collection: దారుణంగా కలెక్షన్స్ .. కష్టాల్లో భైరవం.. మంచు మనోజ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన బైరవం చిత్రంతో బాక్సాఫీస్ ఆడుకుంటోంది. ఒకరోజు సక్సెస్‌ఫుల్‌గా నడిస్తే, మరో రోజు డల్‌గా కలెక్షన్స్ నమోదవుతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న వీకెండ్ సైతం వారికి షాకిచ్చేలా కనిపిస్తోంది. థగ్‌లైఫ్ డిజాస్టర్ కావడంతో కొంత ఊరట కలిగినప్పటికీ అది ఎంత మేరకు భైరవంకు ప్లస్ అయ్యిందనేది కలెక్షన్స్ బట్టే తెలియనుంది. ఈ నేపథ్యంలో 9వ రోజు భైరవం చిత్రం ఎన్ని కోట్లు రాబట్టింది? బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ సినిమా ఇంకెంత వసూలు చేయాలో చూస్తే.

భైరవం చిత్రం బడ్జెట్ ఎంత?
విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన భైరవం చిత్రంలో అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించగా.. జయసుధ కీలకపాత్రలో కనిపించారు. పెన్ స్టూడియెస్‌ డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ భైరవం చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి బైరవం చిత్రాన్ని మొత్తంగా రూ.35 కోట్ల బడ్జెజ్‌తో నిర్మించారు. మే 30న ఈ సినిమా విడుదలైంది.

Bhairavam Day 9 Box Office Collections Worldwide Bellamkonda Sai Srinivas s failed on Saturday

భైరవం ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
మంచు మనోజ్ అన్నీ తానై ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించడం మిగిలిన ఇద్దరు హీరోలు కూడా తలో చేయి వేయడంతో భైరవం చిత్రానికి మంచి బజ్ వచ్చింది. తద్వారా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. నైజాంలో రూ.6 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఆంధ్రలో రూ.7.50 కోట్లు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ.2.2 కోట్లు చొప్పున భైరవం చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.19 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలాగే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను జీ 5 సంస్థ రూ.32 కోట్లు వెచ్చించి దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భైరవం సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 20 కోట్ల రూపాయల షేర్.. 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

భైరవం ఎనిమిది రోజుల వసూళ్లు
ఈ మల్టీస్టారర్ చిత్రానికి ఇండియాలో తొలిరోజు రూ.2.6 కోట్ల ఓపెన్సింగ్ రాగా.. రెండో రోజు రూ.2.4 కోట్లు, మూడో రోజు రూ.2.4 కోట్లు, నాలుగో రోజున రూ.1.21 కోట్లు, ఐదో రోజున రూ.69 లక్షలు, ఆరో రోజున రూ.53 లక్షలు, ఏడో రోజున రూ.40 లక్షలు, ఎనిమిదవ రోజున రూ.49 లక్షల చొప్పున 8 రోజుల వరకు భైరవం చిత్రానికి రూ.10.75 కోట్ల నికర వసూళ్లు రాబట్టినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఓవర్సీస్‌లో తొలుత ఫర్వాలేదని అనిపించుకున్నప్పటికీ క్రమంగా కలెక్షన్స్ పడిపోయాయి. భైరవం చిత్రానికి ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు రూ.55 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చాయి.

భైరవం 9వ రోజు కలెక్షన్స్
కమల్ హాసన్ - మణిరత్నంల థగ్‌లైఫ్‌కు డిజాస్టర్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. శుక్రవారం నాటి వసూళ్లలో ఇది కనిపించింది. 9వ రోజైన శనివారం వీకెండ్ కావడంతో కలెక్షన్స్ బాగుంటాయని చిత్ర యూనిట్ ఆశపడింది. 9వ రోజు ఓవరాల్‌గా 19.78 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 177, బెంగళూరులో 35, విజయవాడలో 47, విశాఖలో 59 చొప్పున షోలు ప్రదర్శితమయ్యాయి.

9వ రోజు భైరవం సినిమాకు ఇండియా వైడ్‌గా రూ.49 లక్షల నికర వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. తద్వారా తొమ్మిది రోజుల వరకు ఇండియాలో రూ.11.35 కోట్ల నెట్, రూ.13.27 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ కలెక్షన్స్ + ఇండియాలో వచ్చిన గ్రాస్ కలిపి ఇప్పటి వరకు భైరవం చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.13.82 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఆదివారం నాటి పర్ఫార్మెన్స్ ఆధారంగా భైరవం చిత్రం థియేట్రికల్ రన్ ఆధారపడి ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా సుమారు రూ.25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. మరి ఈ ముగ్గురు హీరోలు ఎలాంటి మేజిక్ చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X