Bhaje Vaayu Vegam షాకింగ్‌గా భజే వాయువేగం కలెక్షన్లు.. కార్తీకేయ మూవీ బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై యూవీ కాన్సెప్ట్ రూపొందించిన చిత్రం భజే వాయు వేగం. యువ దర్శకుడు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 31వ తేదీన గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ అయింది. కార్తీకేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్ హీరో, హీరోయిన్లుగా రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొన్నది. ఈ క్రమంలో ఈ మూవీ బడ్జెట్ ఎంత? బిజినెస్ ఎంత జరిగింది? బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
భజే వాయు వేగం సినిమా విషయానికి వస్తే.. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంతో హ్యుమన్ ఎమోషన్స్ ఆధారంగా రోడ్ రేసింగ్ జోనర్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ నమోదైంది. ఫస్టాఫ్ వేగం తక్కువు.. సెకండాఫ్ అంచనాలు మించిన వేగంతో సినిమా ఉందనే టాక్ వినిపించింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు ఆసక్తికరంగా మారాయి.

కార్తీకేయ గుమ్మకొండ నటించిన ఈ సినిమాకు సుమారుగా అన్ని ఖర్చులతో కలిపి మొత్తంగా 12 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్టు సమాచారం. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీగా బిజినెస్ పూర్తి చేసుకొన్నది. విడుదలకు ముందే ఈ సినిమా థియేట్రికల్, శాటిలైట్, ఓటీటీ డీల్స్ దాదాపు పూర్తి చేసుకొన్నట్టు తెలిసింది. మొత్తంగా థియేటర్లోకి రాకముందే లాభాలతో సాధించి ప్రేక్షకుల ముందుకు వచ్చిందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపించింది.

భజే వాయు వేగం సినిమా రిలీజ్‌కు ముందు అంతంతా మాత్రంగానే అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసుకొన్నది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం వల్ల కరెంట్ బుకింగ్ ఊపందుకొన్నది. అయితే ఈ సినిమాకు ఓవరాల్‌లో 40 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కాకినాడ, గుంటూరు, వరంగల్, హైదరాబాద్, గోదావరి జిల్లాల్లో మెరుగైన ఆక్యుపెన్సీ నమోదు చేసుకొన్నట్టు సమాచారం.

భజే వాయు వేగం సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీకి కలెక్షన్లు తొలి ఆట తర్వాత మెరుగ్గా కనిపించాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రూపాయల గ్రాస్, ఇండియా వైడ్ 30 లక్షలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు గ్రాస్ వసూలు చేసినట్టు తెలిసింది. తొలి రోజు ఈ సినిమా 1.5 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయల లోపు వసూళ్లు సాధించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











