యూఎస్ఏలో కలెక్షన్ల సునామీ... రంగస్థలం రికార్డుపై కన్నేసిన సీఎం భరత్!

By Bojja Kumar

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. సెకండ్ వీక్‌లోనూ ఈ మూవీ మంచి వసూళ్లు సాధించింది. విజయవంతంగా 10 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు $3.13 మిలియన్ వసూలు చేసింది. గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వారు ఈ మూవీని భారీ స్థాయిలో విడుదల చేశారు. మహేష్ బాబు కెరీర్లో యూఎస్ఏలో అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రం ఇదే. రంగస్థలం రికార్డును త్వరలోనే ఈ చిత్రం అందుకుంటుందని భావిస్తున్నారు.

Recommended Video

Bharath Ane Nenu Overseas Collections
ధర తగ్గించి అందరికీ అందుబాటులో

ధర తగ్గించి అందరికీ అందుబాటులో

భరత్ అనే నేను చిత్రం ఓపెనింగ్ వీక్ $2,789,819 వసూలు చేసింది. రెండో వారంలో ఎక్కువ మంది ప్రేక్షకులను రప్పించేందుకు టికెట్ ధరలు $12 / $8 డాలర్లకు తగ్గించడంతో పాటు 193 స్క్రీన్లలో సినిమాను ప్రదర్శించారు.

3 మిలియన్ క్లబ్‌లోకి

3 మిలియన్ క్లబ్‌లోకి

సెకండ్ ఫ్రైడే కూడా కలెక్షన్స్‌లో మంచి గ్రోత్ కనిపించింది. 9వ రోజుతో ఈ చిత్రం 3 మిలియన్ డాలర్ క్లబ్‌లో జాయినైంది. 3 మిలియన్ మార్క్ అందుకున్న 4వ తెలుగు చిత్రంగా రికార్డుల కెక్కింది. ఇంతకు ముందు బాహుబలి, బాహుబలి 2, రంగస్థలం చిత్రాలు మాత్రమే 3 మిలియన్ పైగా వసూళ్లు రాబట్టాయి.

10 రోజుల కలెక్షన్ వివరాలు

10 రోజుల కలెక్షన్ వివరాలు

బాక్సాఫీసు వద్ద 10వ రోజు పూర్తయ్యే సమయానికి ఓవరాల్ కలెక్షన్స్ $3,131,447 చేరుకుంది. సెకండ్ వీక్ పూర్తయ్యే సమయానికి $340,648 వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

రంగస్థలం రికార్డు బద్దలు కొట్టాలంటే...

రంగస్థలం రికార్డు బద్దలు కొట్టాలంటే...

రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం $3,495,000 వసూలు చేసింది. 2018లో యూఎస్ఏలో హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన తెలుగు సినిమా ఇది. ప్రస్తుతం ‘భరత్ అనే నేను' మూవీ $3,131,447 వద్ద ఉంది. రంగస్థలం రికార్డ్ బద్దలు కొట్టాలంటే...$363,553 వసూలు కావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X