Don't Miss!
- Technology 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా డ్యామేజీ కాని ఫోన్ ధర తగ్గింపు.. 108MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- News ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
యూఎస్ఏ బాక్సాఫీస్: ‘భరత్ అనే నేను’ వర్సెస్ ‘రంగస్థలం’, ఎవరు టాప్ అంటే...
Recommended Video
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద సెకండ్ వీక్‌లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇక్కడ విజయవంతంగా 12 రోజులు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ మూవీ ఆల్రెడీ 'రంగస్థలం' లైఫ్ టైమ్ రికార్డుకు చేరువైంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ రికార్డును అందుకోవడం అంత సులభం కాదని అంటున్నారు. మరి మహేష్ బాబు మూవీ ఆ రికార్డును అధిగమించడంలో ఏ మేరకు సక్సెస్ అవుతుందని అంతా ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.
భరత్ అనే నేను తొలివారం
భరత్ అనే నేను చిత్రం తొలి వారం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద $2,789,819 వసూలు చేసింది. ఈ మధ్య పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో సెకండ్ వీక్‌లోనూ 193 స్క్రీన్లలో ప్రదర్శించే చాన్స్ దక్కింది. దీంతో 9 రోజుల్లోనే $3 మిలియన్ మార్కను అందుకుంది.
సెకండ్ వీక్‌లో
తొలివారం భారీ వసూళ్లు రాబట్టి సెకండ్ వీక్‌లో ఎంటరైన భరత్.... రెండో వారం తొలి 5 రోజుల్లో $440,463 వసూలు చేసింది. దీంతో 12 డేస్ (7+5) టోటల్ కలెక్షన్ $3,230,282 మార్కును అందుకుంది. సెకండ్ వీక్‌లో రోజువారీ కలెక్షన్లు పరిశీలిస్తే శుక్రవారం $106,707, శనివారం $156,032, ఆదివారం $97,520, సోమవారం $41,933, మంగళవారం $38,271 వసూలు చేసింది.
33 రోజుల్లో రంగస్థలం
రంగస్థలం చిత్రం 33 రోజులు విజయవంతంగా ప్రదర్శితం అయి 3.5 మిలియన్ డాలర్ రికార్డ్ నమోదు చేసింది. 2018లో యూఎస్ఏలో విడుదలై అత్యధిక గ్రాస్ సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది.
తొలి 12 రోజుల్లో రెండు చిత్రాల వసూళ్లు ఇలా
తొలి 12 రోజులతో రెండు సినిమాలను కంపేర్ చేస్తే.... ‘భరత్ అనే నేను' చిత్రం $3,230,282 వసూలు చేయగా, రంగస్థలం చిత్ంర $3,272,495 రాబట్టింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ విలేజ్ డ్రామా రికార్డులను మహేష్ బాబు పొలిటికల్ డ్రామా అనుందుకునే అవకాశం ఉందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
నా పేరు సూర్యతో స్క్రీన్ కౌంట్ డౌన్
మరో వైపు మే 4న అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య' చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రం వచ్చిన తర్వాత ‘భరత్ అనే నేను' ప్రదర్శితం అవుతున్న స్క్రీన్ల సంఖ్య భారీగా తగ్గనుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.