3 డేస్ రిపోర్ట్: ‘సీఎం భరత్’ పనితీరు అదుర్స్, ఖజానాకు వసూళ్ల వరద...

By Bojja Kumar

Recommended Video

'Bharath Ane Nenu' Movie Collections

మహేష్ బాబు తొలిసారిగా ముఖ్యమంత్రి పాత్రలో నటించిన చిత్రం 'భరత్ అనే నేను'. సీఎం భరత్ పాత్రలో మహేష్ బాబు అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నాడు. తెరపై సీఎంగా తన పనితీరుతో భరత్ భేష్ అనిపించుకుంటుంటే.... ఇక్కడ బాక్సాఫీసు వద్ద రెస్పాన్స్‌ అదిరిపోతోంది. దీంతో నిర్మాత ఖజానాకు వసూళ్లు వరదలా వచ్చి పడుతున్నాయి. తొలి 3 రోజుల్లోనే ఈ చిత్రం రూ.120 కోట్లకు పైగా వసూలు చేసిందంటే రెస్పాన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మహేష్ బాబు కెరీర్లోనే టాప్

మహేష్ బాబు కెరీర్లోనే టాప్

ఫస్ట్ వీకెండ్ (3 రోజులు)లోనే రూ. 120 కోట్లు(గ్రాస్)కుపైగా వసూలు చేయడం ద్వారా మహేష్ బాబు కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా భరత్ అనే నేను రికార్డుల కెక్కింది. అంతే కాకుండా నాన్ బాహుబలి కేటగిరీలో ఫస్ట్ వీకెండ్ భారీ వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నెం.1 స్థానం సొంతం చేసుకుంది.

రెండు రోజుల్లో 100 కోట్లతో సంచలనం

రెండు రోజుల్లో 100 కోట్లతో సంచలనం

కనీవినీ ఎరుగని రీతిలో ‘భరత్ అనే నేను' చిత్రం తొలి 2 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకు ముందు రంగస్థలం మూడున్నర రోజుల్లోనే ఈ ఫీట్ అందుకోగా, తాజాగా ‘భరత్ అనే నేను' చిత్రం దాన్ని బీట్ చేసింది.

మూడు రోజుల్లోనే భారీగా రికవరీ

మూడు రోజుల్లోనే భారీగా రికవరీ

‘భరత్ అనే నేను' చిత్రాన్ని రూ.100 కోట్లు డిస్ట్రిబ్యూటర్ రైట్స్ అమ్మారు. తొలి 3 రోజుల్లో రూ 120 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేయగా అందులో రూ. 75 కోట్లకుపైగా షేర్ వసూలైంది. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ పెట్టుబడిలో 75శాతం మేర రికవరీ అయినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

త్వరలోనే రూ. 200 కోట్లు

త్వరలోనే రూ. 200 కోట్లు

ఇప్పటి వరకు నాన్ బాహుబలి కేటగిరీలో ఏ తెలుగు సినిమా కూడా రూ. 200 కోట్ల గ్రాస్ మార్కును అందుకోలేదు. ‘రంగస్థలం' మూవీ రూ. 185 కోట్లుకుపైగా వసూళ్లు సాధించినప్పటికీ ఇంకా ఆ మార్కును అందుకోలేదు. భరత్ అనే నేను మూవీ జోరు చూస్తుంటే ఈజీగా రూ. 200 కోట్లను క్రాస్ చేస్తుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X