5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్: ఆకాశమే హద్దుగా సీఎం భరత్.. బాక్స్ ఆఫీస్‌ని చెడుగుడు ఆడుతున్నాడు!
Recommended Video

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షనల్ కనక వర్షం కురిపిస్తోంది. మహేష్ బాబు తొలిసారి రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఈ చిత్రంలో కనిపించాడు. తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో భరత్ అనే నేను చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టిస్తోంది. మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేయబోతోంది.
భరత్ అనే నేను చిత్రం ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 76 కోట్ల షేర్ వాసులు చేయడం విశేషం. మహేష్ సినిమాకు హిట్ టాక్ వస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రం నిరూపించింది. దర్శకుడు కొరటాల మహేష్ ని మునుపెన్నడూ లేని విధంగా సూపర్ స్టైలిష్ గా ఈ చిత్రంలో చూపించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం ఐదు రోజుల్లో 49 కోట్ల వరకు షేర్ సాధించింది. ఓవర్సీస్ లో భరత్ అనే నేను చిత్ర హవా కొనసాగుతోంది.ఐదురోజుల్లో యుఎస్ షేర్ 17 కోట్లు దాటిపోవడం విశేషం. నైజాంలో మాత్రమే ఈ చిత్రం ఐదురోజుల్లో 15.3 కోట్ల షేర్ సాధించింది.


Click it and Unblock the Notifications











