ప్రిన్స్ మహేష్ కలెక్షన్ల దూకుడు.. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్.. 17 రోజుల కలెక్షన్లు ఇవే!
ప్రిన్స్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన భరత్ అను నేను చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నది. ఏప్రిల్ 20వ తేదీన రిలీజైన ఈ చిత్రం ఇప్పటికే 200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ నటించిన ముఖ్యమంత్రి పాత్రకు విపరీతమైన రెస్పాన్స్ వస్తున్నది. అన్నివర్గాల ప్రేక్షకులు, రాజకీయ నేతలు మహేష్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దాదాపు మూడు వారాలు దాటిన వసూళ్లు ఏమాత్రం తగ్గకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

సీడెడ్, నైజాంలో కలెక్షన్లు
భరత్ అనే నేను చిత్రం రిలీజై దాదాపు 17 రోజులైంది. ఈ చిత్రం నైజాంలో 21.5 కోట్లు వసూలు చేసింది. సీడెడ్‌లో రికార్డు స్థాయిలో 10.5 కోట్లు కలెక్ట్ చేయడం గమనార్హం.

ఏపీలో ప్రాంతాల వారీగా
ఏపీలోని జిల్లాల వారీగా చూసుకొంటే.. గుంటూరులో 7.98 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 6.68 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4.1 కోట్లు, కృష్ణా జిల్లాలో 5.57 కోట్లు, నెల్లూరులో 2.6 కోట్లు వసూలు చేసింది.

తమిళ, కర్ణాటక రాష్ట్రాల్లో
ఇక ఏపీ, తెలంగాణేతర రాష్ట్రాల్లో భరత్ అనే నేను సత్తా చాటుతున్నది. కర్ణాటక, మిగితా రాష్ట్రాల్లో కలుపుకొని రూ.11.3 కోట్లు, తమిళనాడులో 1.55 కోట్లు వసూలు చేసింది.

ఓవర్సీస్ మార్కెట్‌లో
ఓవర్సీస్‌లో ప్రిన్స్ మహేష్ కెరీర్‌లోనే గతంలో ఎన్నడూ లేని విధంగా వసూళ్లు నమోదవుతున్నాయి. యునైటెడ్ ఎమిరేట్స్‌లో 8.82 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.21.4 కోట్లు వసూలు చేయడం విశేషం.
బిగ్గెస్ట్ హిట్.. ఉమేర్ సంధూ ట్వీట్
ఇదిలా ఉండగా, ఫిలిం క్రిటిక్ ఉమేర్ సంధూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. భరత్ అనే నేను ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్. ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా రూ.230 కోట్లు వసూలు చేసింది. ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అని ఉమేర్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











