ఫేక్ అంటూ ప్రచారం: ‘భరత్ అనే నేను’ కలెక్షన్స్ అఫీషియల్‌ ప్రకటన!

By Bojja Kumar

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం ఏప్రిల్ 20న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. తొలి వారంలోనే ఈ చిత్రం కలెక్షన్ల మీద ఫేక్ అంటూ ప్రచారం జరుగడంతో... భరత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌లో నిర్మాత డివివి దానయ్య క్లారిటీ ఇచ్చారు. తొలివారం తమ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 161.28 కోట్ల గ్రాస్ రాబట్టిందని, ఇది ఏ మాత్రం ఫేక్ రికార్డ్స్ కాదు. ఒరిజినల్ కలెక్షన్ అని ప్రకటించారు. తాజాగా భరత్ బాక్సాఫీసు వద్ద 2 వారాలు పూర్తయిన సందర్భంగా కలెక్షన్స్ ప్రకటించారు.

అఫీషియల్ ప్రకటన చేసిన డివివి ఎంటర్టెన్మెంట్స్

‘భరత్ అనే నేను' చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 2 వారాలు పూర్తి చేసుకుందని, ఈచిత్రం మొత్తం ఇప్పటి వరకు రూ. 190.63 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని డివివి ఎంటర్టెన్మెంట్స్ వారు అధికారికంగా ప్రకటించారు.

రూ. 200 కోట్ల చేరువలో..

రూ. 200 కోట్ల చేరువలో..

ఇప్పటి వరకు టాలీవుడ్లో నాన్ బాహుబలి కేటగిరీలో రూ. 200 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న చిత్రం ‘రంగస్థలం'. నెల రోజుల్లో ఈ వాసూళ్లు రాబట్టింది. భరత్ అనే నేను రెండు వారాల్లోనే రూ. 190 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. త్వరలోనే ఈ చిత్రం రూ. 200 కోట్ల మార్కును అందుకుంటుందని అంచనా వస్తున్నారు.

Recommended Video

Bharath Ane Nenu Continues Its Collections In USA
మహేష్ బాబు కెరీర్లోనే టాప్

మహేష్ బాబు కెరీర్లోనే టాప్

‘భరత్ అనే నేను' చిత్రం మహేష్ బాబుతో పాటు డివివి ఎంటర్టెన్మెంట్స్ బేనర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రూ. 75 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2000కు పైగా స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

రెండేళ్ల తర్వాత మహేష్ బాబులో టెన్షన్ ఫ్రీ

రెండేళ్ల తర్వాత మహేష్ బాబులో టెన్షన్ ఫ్రీ

దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ మహేష్ బాబు మొహంలో సంతోషం కనిపించింది. రెండేళ్ల క్రితం ‘శ్రీమంతుడు'తో హిట్ కొట్టిన మహేష్ బాబును ఆ తర్వాత వచ్చి రెండు చిత్రాలు నిరాశ పరిచాయి. దీంతో తీవ్రమైన ఒత్తిడికి గురైన ఆయన ‘భరత్ అనే నేను' విజయంతో ఉపశమనం పొందారు. మహేష్ నెక్ట్స్ మూవీ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నారు. జూన్ నుండి ఈ చిత్రం షూటింగ్ మొదలు కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X