తగ్గని ప్రిన్స్ మహేష్ బాక్సాఫీస్ జోరు.. భరత్ అనే నేను కలెక్షన్ల సునామీ..
ప్రిన్స్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన భరత్ అనే నేను చిత్రం సంచలన విజయం దిశగా దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి పాత్రలో కనిపించిన మహేష్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సొంతం చేసుకొంటున్నది. ఇప్పటికే వంద కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా భరత్ అనే నేను చిత్ర కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
Recommended Video


నైజాంలో భారీగా
భరత్ అనే నేను చిత్రం తొలిరోజున నైజాంలో భారీ వసూళ్లను సాధించింది. మొదటి రోజున రూ.4.48 కోట్లు, రెండో రోజున 2.75 కోట్లు, మూడో రోజున 2.97 కోట్లు, నాలుగో రోజున రూ.1.55 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్‌గా నైజాంలో కలెక్షన్ల పరిస్థితిని గమనిస్తే గ్రాస్‌గా రూ.11.75 కోట్లు సాధించింది.

సీడెడ్‌లో కనక వర్షం
ప్రిన్స్ మహేష్ కలెక్షన్ల ప్రభంజనం సీడెడ్‌లో కూడా కొనసాగతున్నది. తొలి రోజున రూ.2.47 కోట్లు, రెండో రోజున 1.09 కోట్లు, మూడో రోజున 1.21 కోట్లు, నాలుగో రోజున 50 లక్షల రూపాయలను వసూలు చేసింది.

వైజాగ్‌లో కలెక్షన్ల జోరు
వైజాగ్‌లో కూడా మహేష్‌బాబు కలెక్షన్ల జోరు భారీగా కనిపించింది. తొలి రోజున రూ.3.21, రెండో రోజున 1.06 కోట్లు, మూడో రోజున 1.20 కోట్లు, నాలుగో రోజున రూ.65 లక్షలతో మొత్తం రూ.5.83 కోట్లు ఈ చిత్రం వసూలు చేసింది.

గోదావరి జిల్లాలో వసూళ్లు
తూర్పు గోదావరి జిల్లాలో భరత్ అనే నేను తొలి రోజున రూ.3.21 కోట్లు, రెండో రోజున 59 లక్షలు, మూడో రోజున 38 లక్షలు, నాలుగో రోజున 38 లక్షలతో 4.80 కోట్లు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.2.87 కోట్లు వసూలు చేసింది.

కృష్ణా జిల్లాలో కలెక్షన్లు
భరత్ అనే నేను చిత్రం కృష్ణా జిల్లాలో నాన్ బాహుబలి రికార్డును అధిగమించింది. తొలిరోజున 1.93 కోట్లు, రెండో రోజున 64 లక్షలు, మూడో రోజున 81 లక్షలు, నాలుగో రోజున 47 లక్షలతో మొత్తంగా రూ.3.85 కోట్లు వసూలు చేయడం గమనార్హం.

గుంటూరులో నాన్ బాహుబలి రికార్డు
గుంటూరులో కూడా నాన్ బాహబలి రికార్డును నెలకొల్పింది. తొలి రోజున రికార్డు స్థాయిలో 4.04 కోట్లు, రెండో రోజున 67 లక్షలు, మూడో రోజున 86 లక్షలు, నాలుగో రోజున 46 లక్షలు కలిపి మొత్తంగా రూ. 6.03 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

ఓవర్సీస్‌లో భరత్ అనే నేను తడఖా
నైజాం, ఏపీ వ్యాప్తంగా భరత్ అనే నేను చిత్రం సుమారు 40 కోట్లు నికరం, 60 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. అమెరికాలో ఈ చిత్రం రూ.16.5కు పైగా వసూలు చేసింది. ఆస్ట్రేలియాలో రూ.2 కోట్లు గ్రాస్, యూఏఈలో రూ.3 కోట్లు వసూలు చేసింది. కర్ణాటకలో రూ.10.3, ఇతర ప్రాంతాలతో కలిపి రూ.3 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











