భరత్ అనే నేను: రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్... ఒక్కొక్క రికార్డు బద్దలువుతోంది!

By Bojja Kumar

Recommended Video

Bharath Ane Nenu Public Talk భరత్ అనే నేను పబ్లిక్ టాక్

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ సాధించింది. బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ 'భరత్ అనే నేను' సాధించిందని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. సినిమా విడుదల ముందు నుండే పాజిటివ్ బజ్ ఉండటం, సినిమా విడుదలైన తర్వాత కూడా సూపర్ హిట్ టాక్ రావడంతో ఇక ముమ్ముందు ఈ చిత్రానికి వసూళ్ల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి రోజు ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 65 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్ రిపోర్ట్

యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్ రిపోర్ట్

సినిమా విడుదలకు ఒక రోజు ముందుగా యూఎస్ఏలో భారీ సంఖ్యలో ప్రీమియర్ షోలు వేశారు. కనీ వినీ ఎరుగని రీతిలో 2000 షోలు ప్రదర్శించారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం $1 మిలియన్‌పైగా వసూలైంది. ఇంకా అన్ని లొకేషన్స్‌కు సంబంధించిన వివరాలు అందాల్సి ఉంది. యూఎస్ఏ ప్రీమియర్స్ హయ్యెస్ట్ గ్రాస్ రికార్డు అజ్ఞాతవాసి ($1,514,000) పేరుతో ఉంది. దీన్ని భరత్ అనే నేను అధిగమిస్తుందని అంటున్నారు.

రూ. 100 కోట్ల అమ్ముడైన థియేట్రికల్ రైట్స్

రూ. 100 కోట్ల అమ్ముడైన థియేట్రికల్ రైట్స్

భరత్ అనే నేను థియేట్రికల్ రైట్స్ రూ. 100 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2000 థియేటర్లలో విడుదల చేశారు. సినిమా విడుదల ముందే టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో భారీగా అమ్ముడయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 85 శాతం సీట్స్ బుక్ అయ్యాయి.

 ఫస్ట్ డే కలెక్షన్ రూ. 65 కోట్ల గ్రాస్

ఫస్ట్ డే కలెక్షన్ రూ. 65 కోట్ల గ్రాస్

ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలైన థియేటర్ల సంఖ్య, అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిన తీరును బట్టి తొలి రోజు రూ. 65 కోట్ల గ్రాస్ ప్రపంచ వ్యాప్తంగా వసూలైనట్లు తెలుస్తోంది. అఫీషియల్‌ ఫిగర్ ఎంత అనేది నిర్మాతలు ప్రకటించాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ రికార్డ్ బద్దలు

పవన్ కళ్యాణ్ రికార్డ్ బద్దలు

నాన్ బాహుబలి కేటగిరీలో పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి' చిత్రం తొలి రోజు రూ. 60.50 కోట్లు వసూలు చేసి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దాన్ని ఇపుడు ‘భరత్ అనే నేను' మూవీ అధిగమించినట్లయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X