Bharat Bhhagya Viddhaata Box Office: భారీ నష్టాల్లో కంగనా మూవీ.. భారత్ భాగ్య విధాత బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటీ?

26/11 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో భారతీయ వెండితెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ కోవలోనే ముంబైలోని కామా అండ్ అల్బెస్ హాస్పిటల్‌లోని రోగులను ప్రాణాలకు తెగించి కాపాడిన నర్స్‌లు, ఆసుపత్రి సిబ్బంది జీవిత కథలు, వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ భారత్ భాగ్య విధాత. బాలీవుడ్ క్వీన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషించారు. జూన్ 12న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో భారత్ భాగ్య విధాత మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ సినిమా వసూళ్లు ఎంత? అనేది పరిశీలిస్తే..

భారత్ భాగ్య విధాత తారాగణం
భారత్ భాగ్య విధాత మూవీని మణికర్ణిక ఫిల్మ్స్, పరంహన్స్ క్రియేషన్స్, యూనియా ఫిల్మ్స్, ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై కంగనా రనౌత్, శైలేష్ ఆర్ సింగ్, ధావల్ గడ, బబిత ఆశివాల్, ఆది శర్మలు నిర్మించగా మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గిరిజా ఓక్ గాడ్‌బోలే, స్మిత తాంబే, సుహిత తట్టే, ఆశా శేలర్, ప్రియా బెర్దే, ఈషా దే, రసిక ఆఘాసే, అమృత నామ్‌దేవ్, ఆదిత్య మిశ్రా, జహిద్ ఖాన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అమన్ పంత్, కృష్ణ సోలో సంగీతం అందించగా.. దేవ్ రావ్ జాదవ్ ఎడిటర్‌గా, అయాన్ సిల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

Bharat Bhhagya Viddhaata Day 6 Expected Box Office Collections Worldwide kangana ranaut s film heading towards disaster

భారత్ భాగ్య విధాత బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి భారత్ భాగ్య విధాత మూవీని 45 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినట్లుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

భారత్ భాగ్య విధాత 5 రోజుల కలెక్షన్స్
భారత్ భాగ్య విధాతకు ఇండియాలో తొలిరోజున కోటి రూపాయలు, రెండో రోజున 1.45 కోట్ల రూపాయలు, మూడో రోజున 1.80 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 65 లక్షల రూపాయలు, ఐదో రోజున 65 లక్షల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు 5.55 కోట్ల రూపాయల నెట్.. 6.60 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది. ఓవర్సీస్‌లో కంగనా రనౌత్ మూవీ దారుణమైన రిజల్ట్ ఎదురైంది. భారత్ భాగ్య విధాత మూవీని ఓవర్సీస్‌లో ఫన్ ఆసియా ఫిల్మ్స్ సంస్థ విడుదల చేసింది. కానీ అక్కడ కంగనా మూవీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది.

నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో కలిపి ఇప్పటి వరకు కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి భారత్ భాగ్య విధాత మూవీకి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 6.75 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.

భారత్ భాగ్య విధాత 6వ రోజు వసూళ్ల అంచనా
విడుదలైన రోజు నుంచి భారత్ భాగ్య విధాత మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. మిక్స్‌డ్ టాక్‌కి తోడు హిందీలో విడుదలైన మై వాపస్ అవుంగా మూవీ నుంచి కంగనా సినిమాకు గట్టి పోటీ ఎదురవుతుండటంతో వసూళ్లు దారుణంగా పడిపోయాయి. బుధవారం మై వాపస్ అవుంగా సినిమాకి 1.65 కోట్ల రూపాయలు వసూలవ్వగా.. కంగనా సినిమాకు 65 లక్షల రూపాయలు మాత్రమే వచ్చింది. ఇంతియాజ్ అలి మూవీ 10 కోట్ల రూపాయలకు దగ్గరవుతుండగా భారత్ భాగ్య విధాత మాత్రం చేతులెత్తేసింది. కంగనా రనౌత్ క్రేజ్ కానీ, నేషనల్ క్రష్ గిరిజా ఓక్ గ్లామర్ కానీ ఈ మూవీని గట్టెక్కించలేకపోయాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారత్ భాగ్య విధాత మూవీ 6వ రోజు వసూళ్లు పరిశీలిస్తే... బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఈ సినిమాకు ఇండియాలో 975 షోలు ప్రదర్శితమై.. 10 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ పేర్కొంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 6వ రోజు కంగనా రనౌత్ మూవీ ఇండియాలో 23 లక్షల రూపాయల నెట్ రాబట్టింది. ఈ సినిమా బుధవారం వరల్డ్ వైడ్‌గా 50 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని భావిస్తున్నారు.

భారత్ భాగ్య విధాత మూవీని 45 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. ఇప్పటి వరకు కేవలం 7 కోట్ల లోపే రాబట్టి, బడ్జెట్ మీద కేవలం 15 శాతం మాత్రమే రికవరీ సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ శుక్రవారం షాహిద్ కపూర్ నటించిన కాక్‌టెయిల్ 2 సహా కొన్ని చిన్నా పెద్దా సినిమాలు రిలీజ్ కానుండటంతో బాక్సాఫీస్ వద్ద భారత్ భాగ్య విధాత మూవీ డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. ఫైనల్ రన్‌లో ఈ సినిమా ఎంత రాబడుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X