twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రపంచ కప్‌ను ఎదురించిన భారత్.. రూ.200 కోట్ల క్లబ్‌లోకి!

    |

    సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన భారత్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సానుకూలమైన జోరును కొనసాగిస్తున్నది. ఆదివారం భారత, పాకిస్థాన్ ప్రపంచ కప్ జరిగిన సమయంలో ఈ సినిమా కలెక్షన్లు పడిపోతాయని భావించారు. అయితే మ్యాచ్‌ను లెక్క చేయకుండా భారత్ చిత్రం నిలకడగా మోస్తారు వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. రిలీజ్ తర్వాత రెండో ఆదివారం రోజున ఎదురైన అగ్ని పరీక్షను ఎదుర్కొని ఎంత మేరకు కలెక్షన్లు సాధించిందంటే..

     ఎక్కువ సంఖ్యలో భారీగా

    ఎక్కువ సంఖ్యలో భారీగా

    బాలీవుడ్‌లో ప్రస్తుత వారం ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. గేమ్ ఓవర్, ఖామోషీ, ఖేల్ ఖల్లాస్, కిస్సే‌బాజ్, రెస్క్యూ, ది జోడి, ఎంఐబీ: ఇంటర్నేషనల్ తదితర చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే భారత్ ముందు ఈ సినిమాలు నిలబడలేకపోవడం, అంతేకాకుండా కొంత మేరకైనా పోటీని ఇవ్వకపోవడం ట్రేడ్ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.

     సానుకూలమైన టాక్‌తో ముందుకు

    సానుకూలమైన టాక్‌తో ముందుకు

    భారత్ చిత్రం రూ.100 కోట్లతో రూపొందింది. సినీ విమర్శకులు, ప్రేక్షకుల సానుకూల టాక్‌తో తొలివారం భారీ వసూళ్లను సాధించింది. తొలివారాంతం తర్వాత సోమవారం నుంచి శుక్రవారం వరకు కలెక్షన్లు క్షీణించాయి. అయితే శుక్రవారం ఈ సినిమా కలెక్షన్లు గతం రోజుకంటే 50 శాతం మేర పెరిగాయి. దాంతో రెండో వారాంతం ఈ సినిమా కలెక్షన్లు పుంజుకొన్నాయి.

    రెండో వారంలో వసూళ్లు

    రెండో వారంలో వసూళ్లు

    భారత్ చిత్రం రెండో వారంలో శుక్రవారం రూ.3.75 కోట్లు వసూలు చేసింది. శనివారం ఈ చిత్రం రూ.6 కోట్లు రాబట్టింది. ఇండియా, పాక్ మ్యాచ్ ఉన్నప్పటికీ ఆదివారం కూడా రూ.6 కోట్లతో సరిపెట్టడం గమనార్హం. దాంతో ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.188 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఎక్కువగా కలెక్షన్లు ఢిల్లీ, యూపీ నుంచే రావడం గమనార్హం.

     రూ.200 కోట్లకు చేరువలో

    రూ.200 కోట్లకు చేరువలో

    భారత్ చిత్రం తొలివారం ఘనంగా వసూళ్ల జైత్రయాత్రప్రారంభించింది. తొలివారం ఈ చిత్రం రూ.172.25 కోట్లు వసూలు చేసింది. ప్రపంచ కప్ ఫీవర్ ఊపందుకోవడంతో రెండో వారం కొంత తగ్గుముఖం పట్టింది. రెండో వారంలో మూడురోజుల్లో కేవలం 16 కోట్లు మాత్రమే వసూలు చేయడంతో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడానికి కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం రూ.188 కోట్ల వసూళ్లను నమోదు చేయడం గమనార్హం.

    English summary
    Bharat movie is doing good at box office in second week. It collected Rs 188 crore approx. This film made on budget of Rs. 100 crore, has not yet touched Rs. 200-crore mark in its second week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X