BMW 4 Days Collections: భర్త మహాశయులకు విజ్ఞప్తి కలెక్షన్లు.. ఎన్ని కోట్లు వస్తే రవితేజ మూవీ లాభాల్లోకి అంటే?

మాస్ మహారాజా రవితేజ హీరోగా యువ తారలు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. SLV సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో సెన్సిబుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సునీల్, సత్య, వెన్నెల కిషోర్, సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు.

ఈ సినిమాకు యువ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరెలియో సంగీతం అందించారు. ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రఫి, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ విభాగాలను పర్యవేక్షించారు. రొమాంటిక్, ఫన్, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జనవరి 13వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Bhartha Mahasayulaku Wignyapthi 4 Days Box Office

ఫ్యామిలీ, రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను భారీగా, ఫారిన్‌లోని అందమైన లోకేషన్లలో రిచ్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా భారీ స్టార్ కాస్ట్, టాలెంటెడ్ టెక్నిషియన్స్, క్రేజీగా ప్రమోషన్స్ చేపట్టారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 40 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఈ సినిమా పాటలు, ప్రమోషన్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా ఫ్యాన్సీ రేటుకు క్లోజ్ అయింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ సుమారుగా 20 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు అని తెలిపారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా గత మూడు రోజుల్లో ఇండియా వైడ్‌గా అంటే తెలుగు, కర్ణాటక రాష్ట్రాల్లో నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా తొలి రోజు 2.6 కోట్ల రూపాయలు, రెండో రోజు 2 కోట్ల రూపాయలు, మూడో రోజు 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియా వైడ్ ఈ చిత్రం 7.1 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 4.5 కోట్ల రూపాయల నెట్, 7.4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక నాలుగు రోజు కూడా ఈ సినిమా స్టడీగా వసూళ్లు సాధించింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 2 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియా వైడ్ 9.1 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఓవర్సీస్‌లో ఈ సినిమాకు సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజైన అన్నీ సినిమాలు భారీ పోటీగా మారడం, అలాగే పరిమితమైన స్క్రీన్ల కారణంగా ఈ సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోలేకపోతున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నార్త్ అమెరికాలో ఈ చిత్రం ఇప్పటి వరకు 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 10.6 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి నటించిన ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 20 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది. ఇంకా ఈ సినిమా 9 కోట్ల రూపాయలను రాబట్టాల్సిన పరిస్థితి బాక్సాఫీస్ వద్ద కనిపిస్తున్నది. రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్ల పరంగా నిలదొక్కుకొంటే బ్రేక్ ఈవెన్ కావడం సులభమైన పనిగానే ఉంటుంది అని అంటున్నారు.

More from Filmibeat

Read more about: bmw ravi teja box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X