BMW 5 Days Collections: భర్త మహాశయులకు విజ్ఞప్తి బాక్సాఫీస్ రిపోర్ట్.. రవితేజ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

మాస్ మహారాజా రవితేజ హీరోగా యువ తారలు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. SLV సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో సెన్సిబుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సునీల్, సత్య, వెన్నెల కిషోర్, సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు.

ఈ సినిమాకు యువ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరెలియో సంగీతం అందించారు. ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రఫి, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ విభాగాలను పర్యవేక్షించారు. రొమాంటిక్, ఫన్, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జనవరి 13వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

BMW 5 Days Box Office

ఫ్యామిలీ, రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను భారీగా, ఫారిన్‌లోని అందమైన లోకేషన్లలో రిచ్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా భారీ స్టార్ కాస్ట్, టాలెంటెడ్ టెక్నిషియన్స్, క్రేజీగా ప్రమోషన్స్ చేపట్టారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 40 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఈ సినిమా పాటలు, ప్రమోషన్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా ఫ్యాన్సీ రేటుకు క్లోజ్ అయింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ సుమారుగా 20 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు అని తెలిపారు.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 1.9 కోట్ల రూపాయలు నెట్, 3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు 1.26 కోట్ల రూపాయల నెట్, 1.85 కోట్ల గ్రాస్, మూడో రోజు 1.4 కోట్ల నెట్, 4వ రోజు 1.25 కోట్ల నెట్, 5వ రోజు 1.3 కోట్ల నెట్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 9 కోట్ల రూపాయలకుపైగా నెట్, 16 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటకలో 1 కోటి రూపాయలు వసూలు చేసింది.

ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా నిలకడగా వసూళ్లను రాబడుతున్నది. ఆరంభంలో కాస్త బాక్సాఫీస్ వద్ద తడబాటు కనిపించినా ప్రస్తుతం మెరుగైన కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా 185K డాలర్లు వసూలు చేసిందని నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ ప్రత్యాంగీరా సినిమాస్ అధికారికంగా వెల్లడించింది. అంటే భారతీయ కరెన్సీలో 1.7 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 18.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం థియేట్రికల్ వాల్యూ 20 కోట్లుగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ మూవీ ఇప్పటి వరకు 11 నుంచి 12 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇంకా ఈ సినిమా 8 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. అయితే రానున్న రోజుల్లో ఇదే జోష్ కొనసాగిస్తే.. బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Read more about: bmw ravi teja box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X