BMW 9 Days Collections: భర్త మహాశయులకు విజ్ఞప్తికి లాభమా? నష్టమా? రవితేజ మూవీ బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటంటే?
మాస్ మహారాజా రవితేజ హీరోగా యువ తారలు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. SLV సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో సెన్సిబుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సునీల్, సత్య, వెన్నెల కిషోర్, సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు.
ఈ సినిమాకు యువ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరెలియో సంగీతం అందించారు. ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రఫి, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ విభాగాలను పర్యవేక్షించారు. రొమాంటిక్, ఫన్, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జనవరి 13వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

ఫ్యామిలీ, రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఈ సినిమా పాటలు, ప్రమోషన్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా ఫ్యాన్సీ రేటుకు క్లోజ్ అయింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ సుమారుగా 20 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు అని తెలిపారు.
తెలుగు, రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు 2.75 కోట్లు, రెండో రోజు 2.1 కోట్లు, మూడో రోజు 2.5 కోట్లు, నాలుగో రోజు 2 కోట్ల రూపాయలు, ఐదో రోజు 1.85 కోట్లు, ఆరో రోజు 1.6 కోట్ల రూపాయలు, ఏడో రోజు 1 కోటి రూపాయలు, ఎనిమిదో రోజు 50 లక్షలు, తొమ్మిదో రోజు 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 14.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా వసూళ్లను పరిశీలిస్తే.. నైజాంలో 3 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 9 కోట్ల రూపాయల నెట్, 14 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక ఈ చిత్రం కన్నడలో 1 కోటి రూపాయలు, తమిళం, కేరళలో కలిపి 50 లక్షలు, ఓవర్సీస్‌లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 16.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు చేరువగా ఉంది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే.. ఇంకా కనీసం 3 నుంచి 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. దాంతో ఈ సినిమా సక్సెస్ థియేట్రికల్ రన్ ముగించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ మేరకు లాభాలను, నష్టాలను నమోదు చేసుకొంటుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











