BMW Closing Collections: భర్త మహాశయులకు విజ్ఞప్తి క్లోజింగ్ కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? రవితేజ మూవీ హిట్టా? ఫట్
మాస్ మహారాజా రవితేజ హీరోగా యువ తారలు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. SLV సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో సెన్సిబుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సునీల్, సత్య, వెన్నెల కిషోర్, సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు.
ఈ సినిమాకు యువ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరెలియో సంగీతం అందించారు. ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రఫి, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ విభాగాలను పర్యవేక్షించారు. రొమాంటిక్, ఫన్, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జనవరి 13వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ మూవీ బడ్జెట్ ఎంత? ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ ఎంత? ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలోని స్టార్ కాస్ట్, టాలెంటెడ్ టెక్నిషియన్స్, క్రేజీగా ప్రమోషన్స్ చేపట్టారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 40 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఈ సినిమా పాటలు, ప్రమోషన్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా ఫ్యాన్సీ రేటుకు క్లోజ్ అయింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ సుమారుగా 20 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
సంక్రాంతి పండుగ సెలవులను ఈ సినిమా ఓ మోస్తారుగా ఉపయోగించుకోవడంతో గౌరవప్రదమైన కలెక్షన్లను నమోదు చేసుకొన్నది. ఈ సినిమా నైజాంలో 3.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1 కోటి రూపాయలు, ఆంధ్రాలో 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతొ ఈ సినిమా 10.5 కోట్ల నెట్, 18 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఈ మూవీ థియేట్రికల్ రన్‌లో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.5 కోట్ల రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఈ చిత్రం 20 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఈ సినిమా ఓవర్సీస్‌లో 300K డాలర్లు అంటే 2.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 22.7 కోట్ల రూపాయల గ్రాస్, 12 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక థియేట్రికల్ రన్‌లో ఈ సినిమా సుమారుగా 60 శాతంపైగా రికవరీని సాధించింది. అయితే మాస్, ఫ్యామిలీ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి రేసులో విడుదలై ఇతర సినిమాల పోటీ ముందు నిలబడలేకపోయింది. దాంతో ఈ సినిమా పూర్తిస్థాయిలో బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. కానీ ఇటీవల కాలంలో రవితేజ నటించిన ఇతర సినిమాల కంటే బెటర్‌గా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం థియేట్రికల్ వాల్యూ కంటే 8 కోట్లు తక్కువగా రాబట్టిందనే టాక్ ట్రేడ్, సినీ వర్గాల్లో ఉంది.


Click it and Unblock the Notifications











