BMW Day 1 Box Office Collections: భర్త మహాశయులకు విజ్ఞప్తికి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్..రవితేజ మూవీకి ఎంతంటే

వరుస ఫ్లాపులలో ఉన్న మాస్ మహారాజా రవితేజ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో చేసిన సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. తన రెగ్యులర్ కమర్షియల్ టచ్‌కు తోడు... ఫ్యామిలీ, రిలేషన్స్ వంటి క్రేజీ సబ్జెక్ట్‌తో ఈ సినిమా చేశారు రవితేజ. మాస్ మహారాజా కెరీర్‌కే ఈ సినిమా అత్యంత కీలకం. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఈ నేపథ్యంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ఓపెనింగ్స్ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే...

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. సునీల్, సత్య, వెన్నెల కిశోర్, సుధాకర, మురళీధర్ గౌడ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Bhartha Mahasayulaku Wignyapthi Day 1 Expected Box Office Collections Worldwide Raviteja s film start with low opening

భర్త మహాశయులకు విజ్ఞప్తి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి 35 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రవితేజ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో విజయం సాధించకపోవడం భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ బిజినెస్‌పై ప్రభావం చూపింది. తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్స్ కలిపి ఈ చిత్రానికి 20 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. దాంతో రవితేజ మూవీ లాభాల్లోకి రావాలంటే 25 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి తొలిరోజు కలెక్షన్స్
50 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రానికి మిక్స్‌డ్‌ కారణంగా బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ది రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు లాంటి భారీ చిత్రాల నుంచి పోటీ కూడా దీనిపై ప్రభావం చూపినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి తొలిరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు 26.86 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 300 షోలు, బెంగళూరులో 199 షోలు, వైజాగ్‌లో 97 షోలు, విజయవాడలో 47 షోలు చొప్పున ప్రదర్శితమయ్యాయి. కడపటి వార్తలు అందేసరికి తొలిరోజున భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి ఇండియాలో 62 లక్షల రూపాయల నెట్ వసూలైనట్లు సాక్‌నిక్ తెలిపింది. దాంతో రవితేజ సినిమా తొలిరోజున ఇండియాలో 4 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే... నార్త్ అమెరికాలో ఈ సినిమాకు ఇప్పటి వరకు ప్రీమియర్స్ + డే 1 కింద 60k డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 55 లక్షల రూపాయలు) వసూలు చేసింది. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో కలిపి రవితేజ మూవీకి ఓవర్సీస్ నుంచి తొలిరోజున కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్‌‌లో వసూలు చేయొచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీకి ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 7 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ రావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X