Bheema 4 days Collections: బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న భీమా.. 4 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
కన్నడ సినిమా రంగంలో కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించిన చిత్రం భీమా. వీరసింహారెడ్డి చిత్రంలో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దునియా విజయ్ హీరోగా, అశ్విని, బ్లాక్ డ్రాగన్ మంజు, కల్యాణి రాజు, గిల్లిగిల్లి చంద్రు తదితరులు నటించిన ఈ చిత్రం భారీగా వసూళ్లను సాధిస్తున్నది.ఆగస్టు 9వ తేదీన రిలీజైన ఈ చిత్రం కన్నడతోపాటు ఇతర ప్రాంతాల్లో మంచి స్పందనను కూడగట్టుకొంటున్నది. ఈ మూవీ బడ్జెట్, కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాల్లోకి వెళితే..
భీమా చిత్రం కన్నడ బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తున్నది. గతంలో కేజీఎఫ్ సాధించిన కలెక్షన్ల కంటే బెటర్‌గా ఈ సినిమా కలెక్షన్లను రాబడుతున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దర్శకుడిగా దునియా విజయ్ రెండో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకొన్నాడు.

కన్నడ చిత్రంగా రూపొందిన భీమా చిత్రాన్ని భారీగా నిర్మించారు. ఈ సినిమా పేరున్న నటీనటులు, టాలెంటెడ్ సాంకేతిక నిపుణుల కూర్పుతో ఈ మూవీని రూపొందించారు. దాంతో ఈ సినిమా నిర్మాణ వ్యయం కూడా భారీగా జరిగింది. ప్రమోషన్స్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను 20 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ చిత్రం 20 కోట్ల షేర్ లక్ష్యంగా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
ఇక ఈ చిత్రం తొలి రోజు భారీగా వసూళ్లను సాధించింది. తొలి రోజు కన్నడ ప్రాంతంలో ఈ చిత్రం 4 కోట్ల రూపాయలను వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇక రెండో రోజు కూడా అదే జోష్‌ను కొనసాగించింది. ఈ చిత్రం 2వ రోజున మరో నాలుగు కోట్ల రూపాయలను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మరో 5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
భీమా చిత్రం తొలి రోజుల్లోనే రికార్డు వసూళ్లను నమోదు చేసింది. 2వ రోజు 10 కోట్ల గ్రాస్, 8 కోట్ల షేర్ రాబట్టింది.ఇదే ఊపును కొనసాగిస్తే.. ఇక మూడో రోజు కన్నడ, ఇతర ప్రాంతాల్లో రికార్డు వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం ప్రధానంగా కన్నడలో 3.5 కోట్ల రూపాయలను, ఇండియాలో ఇతర రాష్ట్రాల్లో వసూళ్లను కలిపి మొత్తంగా 4 కోట్ల నికరంగా 6 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం మూడు రోజుల్లోనే 16 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

ఇక సోమవారం వర్కింగ్ డే కావడంతో దాదాపు 70 శాతం కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. కాకపోతే ఫస్ట్ మండే కలెక్షన్లను చూస్తే బెస్ట్‌గా బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 4వ రోజున ఈ చిత్రం 1 కోటి రూపాయలు నికరంగా 2 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 4 రోజుల్లోనే 19 కోట్ల రూపాయల గ్రాస్, 14 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసింది. తొలివారం ముగిసే సమయానికి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











