Bheema Collections: రికార్డు ఓపెనింగ్స్‌తో దునియా విజయ్ మూవీ.. కన్నడలో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
కన్నడ సినిమా రంగంలో కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించిన చిత్రం భీమా. వీరసింహారెడ్డి చిత్రంలో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దునియా విజయ్ హీరోగా, అశ్విని, బ్లాక్ డ్రాగన్ మంజు, కల్యాణి రాజు, గిల్లిగిల్లి చంద్రు తదితరులు నటించిన ఈ చిత్రం భారీగా వసూళ్లను సాధిస్తున్నది.ఆగస్టు 9వ తేదీన రిలీజైన ఈ చిత్రం కన్నడతోపాటు ఇతర ప్రాంతాల్లో మంచి స్పందనను కూడగట్టుకొంటున్నది. ఈ మూవీ బడ్జెట్, కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాల్లోకి వెళితే..
దునియా విజయ్ అలియాస్ విజయ కుమార్ దర్శకుడిగా మరోసారి సత్తా చాటాడు. మూడేళ్ల క్రితం సలగ చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన రెండో చిత్రాన్ని కూడా భారీ హిట్ మలిచాడు. డ్రగ్స్ మాఫియాతో పోలీసుల కుమ్మక్కు అనే సబ్జెక్ట్‌తో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకొంటున్నారు.

కన్నడ చిత్రంగా రూపొందిన భీమా చిత్రాన్ని భారీగా నిర్మించారు. ఈ సినిమా పేరున్న నటీనటులు, టాలెంటెడ్ సాంకేతిక నిపుణుల కూర్పుతో ఈ మూవీని రూపొందించారు. దాంతో ఈ సినిమా నిర్మాణ వ్యయం కూడా భారీగా జరిగింది. ప్రమోషన్స్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను 20 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ చిత్రం 20 కోట్ల షేర్ లక్ష్యంగా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
భీమా చిత్రం కన్నడ రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఈ చిత్రం 50 నుంచి 55 శాతం వరకు ఆక్యుపెన్సీని సాధించింది. రాయచూర్, తూమకూరు, మైసూర్ తదితర ప్రాంతాల్లో 65 నుంచి 80 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. గుల్బర్గా, బెంగళూరులో 65 శాతానికి పైగా ఆక్యుపెన్సీ రికార్డు చేసింది.

ఇక ఈ చిత్రం తొలి రోజు భారీగా వసూళ్లను సాధించింది. తొలి రోజు కన్నడ ప్రాంతంలో ఈ చిత్రం 4 కోట్ల రూపాయలను వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇక రెండో రోజు కూడా అదే జోష్‌ను కొనసాగించింది. ఈ చిత్రం 2వ రోజున మరో నాలుగు కోట్ల రూపాయలను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మరో 5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
భీమా చిత్రం తొలి రోజుల్లోనే రికార్డు వసూళ్లను నమోదు చేసింది. 2వ రోజు 10 కోట్ల గ్రాస్, 8 కోట్ల షేర్ రాబట్టింది.ఇదే ఊపును కొనసాగిస్తే.. తొలివారం బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల కాలంలో సంక్షోభంలో ఉన్న కన్నడ సినిమా పరిశ్రమకు ఈ సినిమా ఊరటను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











