twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bheemla Nayak Day 11 collections: లాభాల్లోకి రావాలంటే ఇది సరిపోదు.. బ్రేక్ ఈవెన్ కు ఇంకా దూరంగానే?

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మొట్ట మొదటి సినిమా భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంది. శివరాత్రి వరకు కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. కానీ ఆ తర్వాత మాత్రం మళ్ళీ ఒక్కసారిగా డౌన్ అవుతూ వచ్చాయి. సినిమా లాభాల్లోకి రావాలి అంటే బాక్సాఫీసు వద్ద ఇంకా మరిన్ని వసూళ్లను రాబట్టి ఉంటుంది. ఇక మొత్తం 11 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో కలెక్షన్లు అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

    ప్రీ రిలీజ్ బిజినెస్..

    ప్రీ రిలీజ్ బిజినెస్..

    రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భీమ్లా నాయక్ సినిమా భారీగానే బిజినెస్ చేసింది. రానా పవర్ స్టార్ కలయిక కావడంతో బయ్యర్లు సినిమాను భారీ హక్కుకు కొనుగోలు చేశారు. ఇక ఏపీ తెలంగాణలో రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 9 కోట్లకు అమ్ముడవ్వగ ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక ఫైనల్ గా సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్‌ను చేసినట్లు తెలుస్తోంది.

    11వ రోజు వచ్చిన కలెక్షన్స్

    11వ రోజు వచ్చిన కలెక్షన్స్

    'భీమ్లా నాయక్'కు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదట అడ్వాన్స్ బూకింగ్స్ తోనే మంచి వసూళ్లను అందుకున్నాయి. 11వ రోజు ఏరియాల వారిగా కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ.8 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.6 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి సోమవారం రోజు రూ. 36 లక్షలు షేర్‌తో పాటు రూ. 0.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

    11 రోజుల్లో రెండు రాష్ట్రాల కలెక్షన్స్

    11 రోజుల్లో రెండు రాష్ట్రాల కలెక్షన్స్

    మొదటి వారం అనంతరం సినిమా కలెక్షన్స్ మళ్ళీ పెరగలేదు. రోజురోజుకు చాలా డౌన్ అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో 'భీమ్లా నాయక్' డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. టోటల్ గా 11 రోజుల్లో మొత్తం ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 34.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.91 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.44 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.38 కోట్లు, వెస్ట్‌లో రూ. 4.91 కోట్లు, గుంటూరులో రూ. 4.13 కోట్లు, కృష్ణాలో రూ. 3.70 కోట్లు, నెల్లూరులో రూ. 2.50 కోట్లతో కలిపి ఫైనల్ గా రూ. 74.47 కోట్లు షేర్ తో రూ. 113.60 కోట్ల గ్రాస్‌ దక్కింది.

    ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్

    ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్

    భీమ్లా నాయక్ సినిమాకు 11 రోజుల్లో ఏపీ తెలంగాణలో రూ. 74.47 కోట్ల వరకు వసూలు రాగా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.18 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.43 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా 11 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 95.08 కోట్లు షేర్‌తో పాటు రూ. 154.70 కోట్ల గ్రాస్ వచ్చింది.

    భీమ్లా.. లాభాల్లోకి రావాలంటే..

    భీమ్లా.. లాభాల్లోకి రావాలంటే..

    పవన్ , రానా కలయికతో ఒక్కసారిగా ఈ సినిమాకు మార్కెట్ లో సినిమాకు మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. ఇక వచ్చిన క్రేజ్ తో నిర్మాతలు కరెక్ట్ గా ఉపయోగించుకొని ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ చేసిన భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా ఫిక్స్ అయ్యింది. ఇక ఈ సినిమా 11 రోజుల్లో రూ. 106.75 కోట్లు షేర్ వసూలు చేసింది. సినిమా లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 12.92కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది.

    English summary
    Bheemla nayak 11 days total world wide box office collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X