Bheemla Nayak Day 8 collections: ఇంకా టార్గెట్ పూర్తవ్వలేదు.. మరింత తగ్గిపోతున్న కలెక్షన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంది. రానా దగ్గుబాటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సారి కలిసి నటించిన ఈ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అంధించగా యువ దర్శకుడు సాగర్ కె చంద్ర సినిమాను అద్భుతమైన టేకింగ్ తో హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన 8వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి..హిట్ అవ్వాలి అంటే ఇంకా ఏ స్థాయిలో కలెక్షన్డ్ రాబట్టాలి అనే వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్..

ప్రీ రిలీజ్ బిజినెస్..

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భీమ్లా నాయక్ రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 9 కోట్లకు అమ్ముడవ్వగ ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక ఫైనల్ గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్‌ను చేసినట్లు తెలుస్తోంది.

8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్

8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్

ఇక శివరాత్రి అనంతరం ‘భీమ్లా నాయక్'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు చాలా వరకు తగ్గుతూ వచ్చాయి ఇక 8వ రోజు ఏరియాల వారిగా కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. దీంతో నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్‌లో రూ. 7 లక్షలు, వెస్ట్‌లో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి శుక్రవారం రోజు రూ. 74 లక్షలు షేర్‌తో పాటు రూ. 1.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

8 రోజుల్లో ఏపీ, తెలంగాణ వసూళ్లు..

8 రోజుల్లో ఏపీ, తెలంగాణ వసూళ్లు..

8 రోజుల్లో ఏపీ తెలంగాణలో ‘భీమ్లా నాయక్' డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక 8 రోజుల్లో మొత్తం ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 33.42 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.03 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.09 కోట్లు, వెస్ట్‌లో రూ. 4.68 కోట్లు, గుంటూరులో రూ. 4.87 కోట్లు, కృష్ణాలో రూ. 3.44 కోట్లు, నెల్లూరులో రూ. 2.36 కోట్లతో కలిపి రూ. 71.14 కోట్లు షేర్, రూ. 108.15 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్

వరల్డ్ వైడ్ కలెక్షన్స్

8 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 70.40 కోట్లు వసూలు చేసిన ‘భీమ్లా నాయక్' సినిమా మిగిలిన ఏరియాల్లోనూ మంచి కలెక్షన్స్ దక్కించుకుంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 7.74 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.72 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 8 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 90.60 కోట్లు షేర్‌తో పాటు రూ. 147 కోట్ల గ్రాస్ వచ్చింది.

Recommended Video

Bheemla Nayak Review: Pawan Kalyan And Rana Daggubati powerful Power-packed performance
హిట్టవ్వాలి అంటే..

హిట్టవ్వాలి అంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన సినిమా కావడంతో మార్కెట్ లో సినిమాకు మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. అంచనాలకు తగ్గట్టుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ చేసిన భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. అయితే ఈ సినిమా 8 రోజుల్లో రూ. 90.60 కోట్లు షేర్ వసూలు చేసింది. అంటే మరో రూ. 17.40 కోట్లు వస్తేనే హిట్టయినట్లు లెక్క.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X