పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరో న్యూ రికార్డ్ క్రియేట్ చేయనున్న భీమ్లా నాయక్.. అమెజాన్ భారీ డీల్!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మిగతా హీరోల కంటే పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ బిజినెస్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఒక హీరోకు వరుసగా అపజయాలు ఎదురైతే మరో సినిమాపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తాయి. పవన్ కళ్యాణ్ మార్కెట్ మాత్రం ఎప్పటికప్పుడు మళ్లీ కొత్తగా ఉంటుంది. వీలైనంత వరకు మొదటి వారంలోనే భారీ స్థాయిలో లాభాలను అందుకునేలా జనాలను ఎట్రాక్ట్ చేస్తాడు. ప్రస్తుతం అందరి ఫోకస్ కూడా భీమ్లా నాయక్ పైనే ఉంది. ఈ సినిమా విడుదలకు ముందే భారీ లాభాలను అందించేందుకు ప్రయత్నం చేస్తోంది.

చాలామంది ఫోకస్ పెట్టినప్పటికి..
పవర్ స్టార్ పవన్కళ్యాణ్ రానా దగ్గుబాటి మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమా మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ కు రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో ఈ సినిమా పై చాలా మంది హీరోలు ఫోకస్ పెట్టినప్పటికీ ఎందుకో తెర పైకి తేవడానికి అంతగా ధైర్యం చేయలేకపోయారు.ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ఎలాంటి విభేదాలు లేకుండా ఒప్పుకోవడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని తెలుస్తోంది.

రిలీజ్ డేట్ ఫిక్స్
సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హారిక హాసిని అనుబంధ సంస్థ సీతారా ఎంటర్టైనమెంట్స్ లో నిర్మిస్తున్నారు. ఇక భీమ్లా నాయక్ ఇదివరకే సంక్రాంతికి రానున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు మహేష్ బాబు సర్కారు వారి పాట మరోవైపు ప్రభాస్ రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ భీమ్లా నాయక్ ధైర్యంగా బాక్సాఫీస్ పోటీకి సిద్ధమయ్యాడు. మొదట భీమ్లా నాయక్ సినిమాను ఆగస్ట్ లేదా ఆక్టోబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఎందుకో ప్లాన్స్ అయితే వర్కౌట్ కాలేదు. పోటీ ఎంత ఉన్నా కూడా నిర్మాతలు ఏ మాత్రం భయపడడం లేదు. తప్పకుండా సినిమాను సంక్రాంతికి తేవాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రానా కలిసి నటిస్తుండడం వలన అన్ని వర్గాల ప్రేక్షకులలో కూడా అంచనాలు భారీగా పెరిగాయి. అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమా రీమేక్ అనగానే ముందే కొందరు ఆ సినిమాను చూసేశారు. అయితే పవన్ రానా ఇద్దరు కలిసి నటిస్తే మరొక లెవెల్ లో ఉంటుందని చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు.

రిలీజ్ డేట్ ఫిక్స్
సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హారిక హాసిని అనుబంధ సంస్థ సీతారాం టైన్ మెంట్స్ లో నిర్మిస్తున్నారు. ఇక భీమ్లా నాయక్ విడుదల ఇదివరకే సంక్రాంతికి రానున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు మహేష్ బాబు సర్కారు వారి పాట మరోవైపు ప్రభాస్ రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ భీమ్లా నాయక్ ధైర్యంగా బాక్సాఫీస్ పోటీకి సిద్ధమయ్యాడు.

భారీగా ఓటీటీ ఆఫర్స్
ఎలాగైనా సంక్రాంతి బరిలో నిలవాలని పవన్ కళ్యాణ్ రానా కలిసికట్టుగా సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమా తప్పకుండా పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి సినీజీవితంలోనే అత్యధిక స్థాయిలో బిజినెస్ చేయగలదని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం భారీ ఆఫర్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. మొదట డైరెక్ట్ ఓటీటీ రైట్స్ కోసం కూడా ప్రయత్నం చేశారట. కానీ ఆ విషయంలో నిర్మాతలు మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. సంక్రాంతి పోటీకి చాలా బలంగా సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది.

అమెజాన్ ప్రైమ్ అస్సలు తగ్గడం లేదు
భీమ్లా నాయక్ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇది వరకే హాట్ స్టార్ ఒకసారి ప్రయత్నం చేసి నిర్మాతలు చెప్పిన ధరకు మళ్లీ వెనుకడుగు వేసింది. కానీ అమెజాన్ ప్రైమ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. వకీల్ సాబ్ కంటే ఎక్కువగా 15 కోట్ల వరకు ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
శాటిలైట్ హక్కులను కూడా ఒక పది కోట్లకు దక్కించుకోవాలని చూస్తోంది. శాటిలైట్ హక్కులను ఓటిటి హక్కులను ఒక రౌండ్ ఫిగర్ అమౌంటు దక్కించుకుని ఆతర్వాత శాటిలైట్ హక్కులను మరొక రేటుకు అమ్ముకోవాలని చూస్తున్నారు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











