Bheemla Nayak Business: తెలుగు రాష్ట్రాల్లోనే రికార్డు ధర పలుకుతున్న భీమ్లా.. న్యూ సెన్సేషన్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్ సినిమా ఇటీవల అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలైతే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అనుకోకుండా RRR కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 25వ తేదీన వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వస్తుంది. ఆ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక నిర్మాతలకు ఏపీ తెలంగాణ నుంచి భారీగా బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

భారీగా అంచనాలు
మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న భీమ్లా నాయక్ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. మొదటిసారి రానా దగ్గుబాటి పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తుండటంతో దాదాపు తెలుగులో అయితే బాహుబలి రేంజ్ లో అంచనాలు పెరుగుతున్నాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందని కూడా నిర్మాతలు నమ్ముతున్నారు.

రిలీజ్ డేట్ ఫిక్స్..?
ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలు టీజర్ కూడా ప్రేక్షకులలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. తప్పకుండా సినిమా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది అని చెబుతున్నారు. ఇక ఫిబ్రవరి 25 లేదా మార్చి లో విడుదల చేయాలని గతంలో ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మాత్రం మొదటి డేట్ కె ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

సాలీడ్ ఆఫర్స్
ఇక దాదాపు డేట్ ఫిక్స్ అయినట్లు తెలియడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కు సంబంధించిన ఆఫర్స్ కూడా గట్టిగానే వస్తిన్నట్లు సమాచారం. ఈ సినిమాకు మొదటి నుంచి ఆఫర్స్ హై రేంజ్ లోనే వస్తున్నాయి. కానీ నిర్మాత మాత్రం టెంప్ట్ అవ్వకుండా బెస్ట్ డీల్స్ సెట్టయ్యే వరకు ఎదురు చూశారు. ఇక ఫైనల్ గా ఇటీవల డీల్స్ ఫైనల్ చేసే విషయంలో నిర్మాత చర్చలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో బిగ్ డీల్స్
ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే భీమ్లా నాయక్ సినిమాకు భారీగా ఆఫర్స్ వచ్చినట్లు టాక్. మొత్తంగా 100కోట్లకు టచ్ అవుతున్నట్లు సమాచారం. ఇంతకుముందు సినిమాకు 80కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు టాక్ రాగా ఇప్పుడు ఆలస్యం అయిన కొద్దీ కూడా అంతకుమించి రేట్లు పెరుగుతున్నట్లు టాక్. ప్రీ రిలీజ్ బిజినెస్ తో కేవలం తెలుగులోనే సెంచరీ కొడుతుంది అంటే ఇక మిగతా ఏరియాల్లో డీల్స్ ఏ స్థాయిలో ఉంటాయి అనేది చర్చనీయాంశంగా మారింది.
Recommended Video

అత్యధిక రెమ్యునరేషన్
ఇక ప్రస్తుతం నిర్మాత నాగవంశీ దాదాపు అన్ని రకాల బిజినెస్ డీల్స్ పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 50కోట్ల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి. సీతారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాను సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











