Bheemla Nayak సరికొత్త రికార్డు.. మహేష్, చిరులను వెనక్కునెట్టి, ఆ కేటగిరీలో హయ్యెస్ట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అభిమానులు. తెలుగు ప్రేక్షకులకు కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలనే ఆసక్తి ఉంటుంది. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్ ఒక రికార్డు బద్దలు కొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

ఎక్కడా తగ్గట్లేదుగా

ఎక్కడా తగ్గట్లేదుగా

వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పటికే వరుస సినిమాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమా మీద అటు అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. దానికి తగ్గట్టే మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ తో పాటు సినిమాలో ఆయన గెటప్ ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని చూపిస్తూ రిలీజ్ చేసిన ఒక చిన్న వీడియో బాగా ట్రెండ్ అయింది. ఈ ఒక్క వీడియో సినిమా మీద అంచనాలు భారీగా పెంచేసింది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

భారీ అంచనాలు

భారీ అంచనాలు

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాని తెలుగులో భీమ్లా నాయక్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రను దగ్గుబాటి రానా పోషిస్తూ ఉండగా అక్కడ బిజు మీనన్ పోషించిన పాత్రని ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. సినిమాని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సింహభాగం పూర్తికాగా ఇంకా కొంతమేర షూటింగ్ చేయాల్సి ఉందని అంటున్నారు.

పవన్ ఎంట్రీతో

పవన్ ఎంట్రీతో

మలయాళంలో ఈ సినిమా చూసిన సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ ఈ సినిమా హక్కులను వెంటనే కొనుక్కున్నారు. కొనుక్కున్న నాటి నుంచి ఈ సినిమాలో రానా పేరు ఎప్పుడు వినిపిస్తూనే ఉండేది కాకపోతే పోలీస్ అధికారి పాత్రలో బాలకృష్ణ నటిస్తాడని కొన్నాళ్ళు రవితేజ నటిస్తాడని కొన్నాళ్ళు ఇలా పలువురు హీరోల పేర్లు వినిపించాయి. ఫైనల్ గా ప్రాజెక్టులోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా ప్రాజెక్టు మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా ఒక కేటగిరీలో రికార్డు బద్దలు కొట్టింది అని అంటున్నారు.

 మహేష్, చిరులను వెనక్కినెట్టి

మహేష్, చిరులను వెనక్కినెట్టి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రాణా కాంబినేషన్ లో రూపొందుతున్న భీమ్లా నాయక్ ఆడియో హక్కులు దాదాపు 5 కోట్ల నాలుగు లక్షల రూపాయల మేర అమ్ముడుపోయినట్టు చెబుతున్నాను. అయితే నాన్ పాన్ ఇండియా మూవీస్ అంటే పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానీ సినిమాలలో ఇప్పటి వరకు ఈ సినిమాకి హైయెస్ట్ రేటు వచ్చినట్లు చెబుతున్నారు.. గతంలో సర్కారు వారి పాట సినిమా కి 4 కోట్ల 50 లక్షల రూపాయలు ఆడియో హక్కుల ద్వారా రాగా చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాకు దాదాపు 4 కోట్ల రూపాయలు ఈ ఆడియో హక్కుల రూపంలో వచ్చాయి.

Recommended Video

Bheemla Nayak Vs Acharya.. ఏమి సేతుర సామీ ! || Filmibeat Telugu
భీమ్లా నాయక్ టాప్ ప్లేస్ లో

భీమ్లా నాయక్ టాప్ ప్లేస్ లో

అలా ఈ కేటగిరీలో భీమ్లా నాయక్ సినిమా టాప్ ప్లేస్ లో నిలబడింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో దగ్గుబాటి రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుంటే పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ నటిస్తున్నారు.. రఘుబాబు, బ్రహ్మాజీ, రవీంద్ర విజయ్, వండర్ ఉమెన్ లిరీషా వంటి వారు నటిస్తున్న ఈ సినిమా జనవరి 13వ తేదీ 2022వ సంవత్సరంలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారు దర్శకనిర్మాతలు.. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ కథ, కథనం మాటలు అందిస్తున్నారు.. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నాగ వంశీ నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X