Bheemla Nayak Day 2 Collections.. బాక్సాఫీస్ వద్ద అరాచకం.. తగ్గేదేలే అంటున్న పవన్ కల్యాణ్
భీమ్లా నాయక్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఎదురే లేకుండా పోతున్నది. ఈ చిత్రానికి అన్ని రకాల అవరోధాలు ఏపీ ప్రభుత్వం నుంచి ఎదురైనప్పటికీ.. వసూళ్ల విషయంలో తగ్గేదేలే అంటూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. తొలి రోజు ఊహించిన విధంగా కలెక్షన్లను నమోదు చేసిన ఈ చిత్రం రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రెండో రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే...

ఏపీ సర్కార్ అన్ని విధాల
భీమ్లా నాయక్ సినిమాపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడం, కక్ష పూరితంగా వ్యవహరించడం వివాదాస్పదమైంది. టికెట్ రేట్లు తక్కువగా ఉండటం, బెనిఫిట్ షోలు లేకపోవడం, పలుచోట్ల థియేటర్లలో షోలు క్యాన్సిల్ అయినప్పటికీ భీమ్లా నాయక్ సినిమా కలెక్షన్లను ఏపీ ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. తొలి రోజు ఏపీ, తెలంగాణాలో 26.5 కోట్ల నికరంగా.. 30 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేయడం విశేషంగా మారింది.

తక్కువ థియేటర్లలో ఎక్కువ కలెక్షన్లు
భీమ్లా నాయక్ కలెక్షన్ల ఏ రేంజ్‌లో ఉందంటే.. భీమ్లా నాయక్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 1800పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి రోజున సుమారు 60 కోట్ల వరకు రాబట్టింది. పుష్ప విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 3500 థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రం 60 కోట్లకుపైగా రాబట్టింది. తక్కువ థియేటర్లలో రిలీజై ఎక్కువ రాబట్టిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది.

రెండో రోజు భారీగా రెస్పాన్స్
ఇక భీమ్లా నాయక్ చిత్రానికి రెండో రోజు కూడా భారీ స్పందన లభించింది. రిలీజైన ప్రతీ చోట సగటున 80 శాతం అక్యుపెన్సీ నమోదైంది. వారాంతం కావడంతో అభిమానులు, సాధారణ ప్రజలు పోటెత్తారు. అంతేకాకుండా అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగా నమోదైంది. దీంతో రెండో రోజు కూడా అత్యధిక కలెక్షన్లు ఈ సినిమా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఓవర్సీస్‌లో రెండో రోజు ఇలా..
భీమ్లా నాయక్ చిత్రం రెండో రోజున కూడా అమెరికాలో హంగామా చేస్తున్నది. తొలి రోజు ప్రీమియర్లతో కలుపుకొని 1.35 మిలియన్లు రాబట్టింది. రెండో రోజున కడపటి వార్తలు అందేసరికి ఈ చిత్రం 355 లొకేషన్లలో 1170 షోల ద్వారా 225k డాలర్లు వసూలు చేసినట్టు సమాచారం. దీంతో ఈ చిత్రం 1.5 మిలియన్లకుపైగా వసూలు చేసే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు అంచనా
ఇక ప్రపంచవ్యాప్తంగా భీమ్లా నాయక్ రెండో రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. సుమారు 25 కోట్లు నికరంగా.. 40 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. అంటే ఈ చిత్రం రెండో రోజు 100 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇదే జరిగితే బాక్సాఫీస్ వద్ద మరోసారి పవన్ కల్యాణ్ స్టామినా రుజువయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











