Bheemla Nayak Day 5 Collections పవన్ కల్యాణ్ ఖాతాలో సరికొత్త రికార్డు.. లాభాల్లోకి రావాలంటే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం తొలి మూడు రోజుల్లో రికార్డు వసూళ్లు సాధించిన ఈ చిత్రం తొలి వారాంతం తర్వాత నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. ఏపీలో అనేక వివాదాస్పద అంశాల మధ్య రిలీజైన భీమ్లా నాయక్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా 4 రోజులు కలెక్షన్లతోపాటు 5వ రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే..

ఇండియాలో 1, అమెరికాలో 6వ స్థానం
రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్, నిత్య మీనన్ నటించిన భీమ్లా నాయక్ వసూళ్ల పరంగా అమెరికాతోపాటు, ఇండియాలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో నంబర్ వన్‌గా, ఉత్తర అమెరికాలో ఆరో స్థానంలో నిలిచింది. హాలీవుడ్ సినిమాలకు సమానంగా ఈ సినిమా వసూళ్లను రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో
భీమ్లా నాయక్ చిత్రం తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 61.24 కోట్లు, రెండో రోజున 32.51 కోట్లు, మూడో రోజున 34.63 కోట్లు, నాలుగో రోజున 13.70 కోట్లు సాధించింది. దీంతో ఈ చిత్రం రూ.142.08 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఇటీవల కాలంలో ఈ రేంజ్‌లో వసూళ్లు సాధించిన చిత్రంగా ఘనతను సొంతం చేసుకొన్నది.

నైజాంలో భీమ్లా నాయక్ దూకుడు
ఇక నైజాంలో భీమ్లా నాయక్ కలెక్షన్ల దూకుడుకు అడ్డులేకుండా పోయింది. తొలి రోజున 13.6 కోట్లు, రెండో రొజు 7.5 కోట్లు, మూడో రోజు 6.55 కోట్లు, నాలుగో రోజు 2.80 కోట్లు వసూళ్లను నమోదు చేసింది. మొత్తంగా నాలుగు రోజులకు 30.45 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసింది. దీంతో పవన్ కల్యాణ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి రుజువు అయింది.

అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో..
భీమ్లా నాయక్ చిత్రం ఓవర్సీస్‌లో కూడా దుమ్మురేపుతున్నది. ఈ చిత్రం యూకేలో 146,818 పౌండ్లు అంటే 1.48 కోట్లు, ఐర్లాండ్‌లో 11051 డాలర్లు అంటే.. 11.16 లక్షలు, ఆస్ట్రేలియాలో 2,90,412 డాలర్లు అంటే రూ.1.58 కోట్లు, న్యూజిలాండ్‌లో 24,222 డాలర్లు అంటే.. 12.26 లక్షలు వసూలు చేసింది. ఇక ఉత్తర అమెరికాలో ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం 2 మిలియన్ డాలర్లు అంటే.. 15.09 కోట్లు వసూలు చేసింది.

ఐదో రోజున కలెక్షన్ల అంచనా ఇలా..
అలాగే భీమ్లా నాయక్ చిత్రానికి మహాశివరాత్రి పర్వదినం కలిసి వచ్చింది. 4వ రోజు వసూళ్లు కాస్త తగ్గాయాని ట్రేడ్ రిపోర్టులు వెల్లడించాయి. అయితే ఆ లోటును భీమ్లా నాయక్ సినిమా 5వ రోజు సరిచేస్తుందని అంటున్నారు. ఈ చిత్రం 5వ రోజున సుమారు 6 నుంచి 6.5 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 80 కోట్లకుపైగా నికర వసూళ్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..
ఇక భీమ్లా నాయక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ 106 కోట్లు నమోదైంది. దాంతో ఈ చిత్రం 108 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 70 కోట్లకుపైగా నికర వసూళ్లను రాబట్టింది. దాంతో ఇంకా ఈ సినిమా 38 కోట్ల వరకు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











