ఓవర్సీస్ లో అడ్వాన్స్ బూకింగ్స్ తోనే షాక్ ఇస్తున్న భీమ్లా నాయక్.. కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మొట్టమొదటి యాక్షన్ మూవీ భీమ్లా నాయక్ విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రెండ్ అవ్వగా యూట్యూబ్ లో కూడా మిలియన్ల వ్యూవ్స్ అందుకున్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుంది అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా సాలిడ్ వసూళ్లను అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గత సినిమాల రికార్డులు అలాగే భీమ్లా నాయక్ క్రియేట్ చేయబోయే రికార్డులు వివరాల్లోకి వెళితే...

Recommended Video

Bheemla Nayak Trailer Records భీమ్లా నాయక్ రికార్డుల బీభత్సం Pre Booking Status | Filmibeat Telugu
 పవర్ స్టార్ క్రేజ్

పవర్ స్టార్ క్రేజ్


పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటాయి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సారి రానా దగ్గుబాటి కూడా అతనికి తోడవడం భీమ్లా నాయక్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు ఇది రీమేక్ కావడం మరొక ప్రధాన అంశం. ఆ రీమేక్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా భీమ్లా నాయక్ ను థియేటర్లో చూడాలి అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటే పవర్ స్టార్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఓవర్సీస్ లో భారీగా..

ఓవర్సీస్ లో భారీగా..

సాధారణంగా ఏదైనా సినిమా రీమేక్ కాబోతోంది అంటే అభిమానులలో తప్పితే మిగతా వారిలో పెద్దగా అంచనాలు ఉండవు. ఇక ఈ సినిమాలో విషయంలో మాత్రం మిగతా ఆడియన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇక తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పటికీ అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది కానీ ఓవర్సీస్ లో సినిమా మొదట పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకు వస్తుందా లేదా అనే ఊహాగానాలు చాలా వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే షాక్ ఇస్తున్నాడు.

గత రికార్డులు

గత రికార్డులు

పవన్ కళ్యాణ్ గత సినిమాలకు సంబంధించిన యూఎస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. అజ్ఞాతవాసి 1.52 మిలియన్ డాలర్లు అందుకొని నాన్ బాహుబలి 2 రికార్డుతో కొనసాగుతోంది. సర్దార్ గబ్బర్ సింగ్ 616K డాలర్లతో నాన్ బాహుబలి రికార్డులో కొనసాగింది. ఇక అప్పట్లో అత్తారింటికి దారేది ఆల్ టైమ్ రికార్డుగా 345K దాలర్లను అందుకుంది. ఇక కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు 173K డాలర్లు, గబ్బర్ సింగ్ 161K డాలర్లు, పంజా 93K డాలర్లతో అప్పట్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాయి.

యూఎస్ లో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

యూఎస్ లో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

ఇక ఇప్పుడు రానా దగ్గుబాటి తో కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ యూఎస్ లో 300K డాలర్లు గా నమోదయ్యాయి. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మాస్ యాక్షన్ సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొదటిరోజు మొదటి షో చూడాలని అడ్వాన్స్ బుకింగ్స్ తోనే భారీ స్థాయిలో టికెట్లను కొనుగోలు చేస్తున్నారు.

యూకేలో కూడా భారీగా

యూకేలో కూడా భారీగా


అలాగే యూకేలో కూడా భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ తో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. యూకే లో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా విడుదల కాని రేంజ్ లో అత్యధిక స్క్రీన్స్ లో భీమ్లా నాయక్ మూవీ సందడి చేయబోతోంది. ఇప్పటికే అక్కడ 75 పౌండ్స్ లను సాధించిన ఈ సినిమా 100 పౌండ్లు దగ్గరలో ఉంది.

 ఫ్యాన్స్ డిమాండ్ మేరకు

ఫ్యాన్స్ డిమాండ్ మేరకు


ఓవర్సీస్ లో చాలా వరకు భీమ్లా నాయక్ సినిమా ఈసారి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేలా ఉందని అర్థమవుతోంది. ఆస్ట్రేలియాలో అయితే ఈ సినిమాకు సంబంధించిన మొదట షోలు ఎక్కువగా వేయడానికి ఆసక్తి చూపలేదు. మెల్బోర్న్ ఐమాక్స్ లో కేవలం మొదట ఒక షో కు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా కొన్ని గంటల్లోనే అమ్ముడయ్యాయి. ఫ్యాన్స్ డిమాండ్ మేరకు మరొక రెండు షోలను కూడా ఐమాక్స్ లో జత చేయబోతున్నట్లు సమాచారం. చూస్తుంటే భీమ్లా నాయక్ రికార్డుల్లో ఏమాత్రం తగ్గలే లేదు అనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X