Bheemla Nayak: అడ్వాన్స్ బూకింగ్స్ తో అక్కడ మరో రికార్డు క్రియేట్ చేయబోతున్న పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మొట్టమొదటి చిత్రం భీమ్లా నాయక్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ యుఎస్ లో ఇప్పటికే మొదలయ్యాయి. అయితే అక్కడ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా భీమ్లా నాయక్ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

 బిగ్గెస్ట్ హై వోల్టేజ్ డ్రామా

బిగ్గెస్ట్ హై వోల్టేజ్ డ్రామా

వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా భీమ్లా నాయక్ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఈ సినిమా తెలుగులో అయితే బాహుబలి కంటే తక్కువ ఏమి కాదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పవర్ ఫుల్ పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు ఇప్పటికే వీరికి సంబంధించిన టీజర్స్ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకున్నాయి.

 థమన్ సంగీతంతో..

థమన్ సంగీతంతో..

అంతేకాకుండా థమన్ అందించిన సంగీతం కూడా సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. మొదట వచ్చిన టైటిల్ సాంగ్ నుంచి రీసెంట్ గా వచ్చిన లవ్ పాట వరకు అన్నీ కూడా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి. మొత్తానికి సినిమా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లుగా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అలాగే ఫిబ్రవరి 25వ తేదీన విడుదల తేదీన సినిమా వస్తుండడంతో పలుచోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.

 ఇప్పటికే 100K డాలర్లు

ఇప్పటికే 100K డాలర్లు

పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాకు కూడా ఓవర్సీస్ లో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక భీమ్లా నాయక్ సినిమాకు కూడా ఓవర్సీస్ లో కుడా అదే తరహాలో ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో 100K డాలర్లను అందుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది అడ్వాన్స్ ప్రీ సేల్స్ తోనే అత్యధిక వసూళ్లను అందుకున్న ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసినట్లే లెక్క. ఇక ఒక మిలియన్ డాలర్లను ఈ సినిమా చాలా తొందరగానే అందుకుంటుంది అని చెప్పవచ్చు.

త్రివిక్రమ్ బాధ్యతగా..

త్రివిక్రమ్ బాధ్యతగా..

త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలు అందిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా తన ఇన్వాల్వ్మెంట్ చూపిస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు సాగర్ చంద్ర అయినప్పటికీ షూటింగ్ నుంచి ఎడిటింగ్ వరకు త్రివిక్రమ్ అన్ని విషయాల్లోనూ ఇంట్రెస్ట్ చూపించడంతో సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ప్రేక్షకుల నవ్వుతున్నారు.

200కోట్ల వరకు

200కోట్ల వరకు

ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ పై కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే నాన్ థియేట్రికల్ గా సినిమా 70 కోట్లకుపైగా లాభాలను అందించినట్లు సమాచారం. ఇక బాక్సాఫీసు వద్ద వంద కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. హిందీలో కూడా విడుదల అవుతోంది కావున సినిమా టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల వరకు బిజినెస్ చేయవచ్చు అని మరొక చోట కనిపిస్తుంది. మరి సినిమా అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X