భీమ్లా నాయక్ నిర్మాత చేతికి RRR: ఏకంగా అన్ని కోట్లకు డీల్.. టాలీవుడ్‌లో పెను సంచలనం

'బాహుబలి' వంటి సంచలన చిత్రం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అదే సమయంలో దీని రేంజ్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది.

అన్ని ఇండస్ట్రీలూ ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా హక్కులు 'భీమ్లా నాయక్' ప్రొడ్యూసర్ నాగ వంశీ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోన్న ఈ న్యూస్ గురించి తెలుసుకుందాం పదండి!

విప్లవ వీరులుగా మారిన స్టార్లు

విప్లవ వీరులుగా మారిన స్టార్లు

స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి తెరకెక్కించిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో తారక్.. కొమరం భీం, చరణ్.. అల్లూరి పాత్రలను పోషిస్తున్నారు.

ఈ సారి రిలీజ్ డేట్ నో డౌట్

ఈ సారి రిలీజ్ డేట్ నో డౌట్

క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన RRR మూవీని 2020లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ఇది పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత కూడా చాలా డేట్లను ప్రకటించినా విడుదల కాలేదు. ఇక, సంక్రాంతికి తీసుకు రావాలని అనుకున్నా సాధ్య పడలేదు. దీంతో ఈ సినిమాను మార్చి 25న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది.

అంచనాలు పెంచి.. రికార్డ్స్

అంచనాలు పెంచి.. రికార్డ్స్

ఆరంభం నుంచే RRR మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది వచ్చినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. మరీ ముఖ్యంగా ఆ మధ్య వచ్చిన ట్రైలర్‌కు దేశ వ్యాప్తంగా స్పందన దక్కింది. ఇందులో హీరోల ఎలివేషన్స్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. దీంతో రికార్డులు సైతం బద్దలైపోయాయి.

గ్రాండ్‌గా రిలీజ్.. 12 భాషల్లో

గ్రాండ్‌గా రిలీజ్.. 12 భాషల్లో

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నేరుగా విడుదల చేయబోతున్నారు. అలాగే, టర్కిష్, స్పానిష్, పోర్చుగీస్, కొరియన్, జపనీస్, చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో కూడా దీన్ని డబ్బింగ్ చేస్తారని గతంలోనే వెల్లడించారు.

భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్

భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్

భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న RRR మూవీ హక్కులకు అన్ని భాషల్లోనూ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా హక్కులను ప్రముఖ సంస్థలు భారీ ధరలకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ. 250 - 300 కోట్ల మధ్యలో జరిగినట్లు ట్రేడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 భీమ్లా నాయక్ నిర్మాత చేతికి

భీమ్లా నాయక్ నిర్మాత చేతికి

RRR మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా విదేశాల్లో కూడా దీనికి మంచి స్పందన వచ్చేలా కనిపిస్తోంది. యూఎస్‌లో ఇప్పటికే ప్రీ సేల్ మొదలవగా కొన్ని వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘భీమ్లా నాయక్' చిత్ర నిర్మాత సూర్యదేవర నాగ వంశీ RRR హక్కులు తీసుకున్నాడని తెలుస్తోంది.

Recommended Video

Radhe Shyam Art Director Ravinder Reddy Exclusive Interview About Movie| Prabhas | Filmibeat Telugu
భారీ డీల్‌కు వంశీ సొంతం

భారీ డీల్‌కు వంశీ సొంతం

భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న RRR మూవీకి సంబంధించిన ఆస్ట్రేలియా థియేట్రికల్ రైట్స్‌ను రూ. 6.50 కోట్లకు సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ దక్కించుకున్నాడని తాజాగా తెలిసింది. దీంతో అక్కడ భారీ ధరకు అమ్ముడుపోయిన తొలి సినిమాగా ఇది రికార్డు క్రియేట్ చేసిందట. ఇప్పుడీ న్యూస్ టాలీవుడ్‌లో సంచలనం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X