Bheemla Nayak Closing Collections : పవన్ కళ్యాణ్ సినిమా ఎంత కలెక్ట్ చేసింది?.. హిట్ అవ్వాలంటే ఎంత రావాలంటే?

విడుదలకు ముందు భారీ అంచనాలతో భారీ ఎత్తున విడుదలైన సినిమా 'భీమ్లా నాయక్'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానా కలిసి నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తరువాత మొదటి ఆట నుంచి మంచి టాక్‌ను అందుకున్న ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కూడా ముందు అద్భుతమైన తీరు కనబరించింది. అయితే రాను రాను ఈ సినిమా కలెక్షన్స్ లో కొంత డ్రాప్ కనిపించింది. ఒకరకంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేట్లు ప్రకటించకపోవడం ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో పెద్ద దెబ్బగా మారింది. ఇక ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం

భారీ అంచనాలతో

భారీ అంచనాలతో

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాను తెలుగులో 'భీమ్లా నాయక్' పేరుతో రూపొందించారు. పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో ఈ సినిమాను ప్లాన్ చేసి ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు సినిమా మీద ఏర్పాడ్డాయి ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

ఇతర కీలక పాత్రల్లో

ఇతర కీలక పాత్రల్లో

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వ పర్యవేక్షణ చేయడమే కాక స్క్రీన్ ప్లే సహా మాటలు కూడా అందించారు. థమన్ సినిమాకు సంగీతం సమకూర్చడమే కాక రీ రికార్డింగ్ కూడా అందించారు. అలాగే ఈ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే రావు రమేష్, రవి వర్మ, మురళీ శర్మ, రఘుబాబు, చౌదరి, సముద్ర ఖని, పమ్మి సాయి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రీ రిలీజ్ బిజినెస్

భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'భీమ్లా నాయక్' సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, మిగతా భారత దేశం మొత్తం 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు మరో తొమ్మిది 9 కోట్లకు అమ్ముడు పోయాయి. ఆ లెక్కన 'భీమ్లా నాయక్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్‌ జరుపుకుంది.

 ముందు కలెక్షన్లు భారీగా

ముందు కలెక్షన్లు భారీగా

'భీమ్లా నాయక్' సినిమాకు ముందు కలెక్షన్లు భారీగా వచ్చాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ను రాబట్టినా క్రమంగా అవి తగ్గుతూ వచ్చాయి. అయితే 'రాధే శ్యామ్', కాశ్మీర్ ఫైల్స్ లాంటి చిత్రాలు విడుదల కావడంతో మరింత దారుణంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 21వ రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 3 లక్షలే వచ్చాయి. అయితే 22వ రోజు ఈ సినిమాకు 6 లక్షలు వచ్చాయి.

ఓవరాల్ గా

ఓవరాల్ గా

ఇక ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 'భీమ్లా నాయక్' అంతగా రాణించలేదు. ఫలితంగా నైజాంలో రూ. 34.97 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.64 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.49 కోట్లు, వెస్ట్‌లో రూ. 5.09 కోట్లు, గుంటూరులో రూ. 5.26 కోట్లు, కృష్ణాలో రూ. 4.24 కోట్లు, నెల్లూరులో రూ. 2.80 కోట్లతో కలిపి రూ. 76.67 కోట్లు షేర్, రూ. 117.54 కోట్లు గ్రాస్‌ సాధించింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.23 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.53 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 3 వారాల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.43 కోట్లు షేర్‌తో పాటు రూ. 158.75 కోట్ల గ్రాస్ వచ్చింది.

Recommended Video

Bheemla Nayak Collections 100 కోట్ల షేర్ సాధించిన భీమ్లా నాయక్ | Filmibeat Telugu
బ్రేక్ ఈవెన్ కు ఎంత కావాలి

బ్రేక్ ఈవెన్ కు ఎంత కావాలి

ఇక క్రేజీ కాంబోలో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'భీమ్లా నాయక్'కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేవడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మూడు వారాల్లోనే రూ. 97.43 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 10.55 కోట్లు వసూలు చేస్తేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఇక ఆ అవకాశం లేనట్టే కాబట్టి ఈ సినిమా హిట్ దక్కించుకోవడం కష్టమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X