భీష్మ 3 డేస్ కలెక్షన్స్: క్రేజీ జోడీ వసూళ్లు.. పరిస్థితి చూస్తుంటే..
యంగ్ హీరో నితిన్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న క్రేజీ జోడీ బాక్సాఫీస్ వసూళ్ళలో ఏ మాత్రం వెనుకడుగేయడం లేదు. ఫిబ్రవరి 21వ తేదీన 'భీష్మ' రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ జోడీ.. తొలిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకొని అదే హవా కొనసాగిస్తోంది. ఆశించిన మేర ఆకట్టుకుంటూ వసూళ్లు రాబడుతోంది. మరి ఈ మూడు రోజుల్లో భీష్మ వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దామా..

రెండో ప్రయత్నంలో వెంకీ కుడుముల
'ఛలో' అంటూ సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకీ కుడుముల రెండో ప్రయత్నంలోనూ సక్సెస్ అయ్యాడు. ఆయన డైరెక్ట్ చేసిన 'భీష్మ' మూవీ క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. వసూళ్ల పరంగా భేష్ అనిపించుకుంటూ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ కొనసాగిస్తోంది. ఇది చూస్తున్న భీష్మ దర్శకనిర్మాతలు హాపీగా ఉన్నారు.

మొదటి 2 డేస్ సేమ్ స్పీడ్..
మొదటే రోజే భీష్మ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజూ అదే స్పీడ్ కొనసాగింది. పైగా శివరాత్రి, వీకెండ్ ఇలా అన్నీ కలసి రావడం భీష్మకు ప్లస్ అయింది. దీంతో మొదటి రోజు వసూళ్లకు ధీటుగా రెండో రోజూ దాదాపు 8.10కోట్లు కొల్లగొట్టింది భీష్మ మూవీ. మొత్తంగా చూస్తే రెండు రోజుల్లోనే 12.80కోట్ల షేర్‌ను, 19.30కోట్ల గ్రాస్‌ను రాబట్టింది భీష్మ.

ఆదివారం అడ్వాంటేజ్.. మూడో రోజు పరిస్థితి
రెండు రోజుల పాటు ఆశించిన ఫలితం రాబడుతూ కాసులు వసూలు చేసిన భీష్మకు మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ కలిసొచ్చింది. పోటీకి ఏ సినిమాలు లేకపోవడం, సెలవు కావడంతో మూడో రోజు కూడా మంచి వసూళ్లు రాబట్టినట్లు రిపోర్ట్స్ అందాయి. మూడో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు రెండో రోజు తో పోల్చితే కేవలం 5% లోపే డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి సినిమా భారీగా గ్రోత్ సాధించిందని తెలుస్తోంది.

రెండో రోజుతో పోల్చితే..
రెండో రోజుతో పోల్చితే మూడో రోజు ఓవరాల్‌గా గ్రోత్ 15% వరకు ఉన్నట్లు సమాచారం అందింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్ వద్ద భీష్మ సందడి కనిపించింది. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి మూడో రోజు 4 కోట్లు వసూలయినట్లు తెలిసింది.

ఓవర్సీస్ మార్కెట్‌లో భీష్మ
దేశంలోనే గాక ఓవర్సీస్ మార్కెట్ లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది భీష్మ. ఇప్పటికే అక్కడ 500K డాలర్స్ వసూళ్లు రాబట్టి 1 మిలియన్ డాలర్ దిశగా పరుగులు పెడుతోంది. నితిన్, రష్మిక రొమాన్స్ చూసి ఫిదా అవుతున్నారు ఓవర్సీస్ ఆడియన్స్.
Recommended Video


బ్రేక్ ఈవెన్ స్పాట్.. టార్గెట్ దగ్గరలో
ఇకపోతే భీష్మ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు రోజుల్లోనే భీష్మ 14.80కోట్ల షేర్‌ను, 21.30కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్టు తెలుస్తోంది. భీష్మ చిత్రం దాదాపు 23కోట్లకు అమ్ముడు పోగా.. 25కోట్ల షేర్‌ను రాబట్టే టార్గెట్‌తో దిగింది. ఇదే జోష్ కొనసాగిస్తే మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ ఖాయం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.


Click it and Unblock the Notifications











