భీష్మ 4 డేస్ కలెక్షన్స్: వెనక్కితగ్గేదే లేదంటూ.. హై స్పీడ్‌లో పెళ్లికొడుకు
కొత్త పెళ్లికొడుకు, యంగ్ హీరో నితిన్.. ఎక్కడా వెనక్కి తగ్గనంటున్నాడు. భీష్మ సినిమాతో 2020కి స్వాగతం చెప్పిన ఈ కుర్రోడు వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఫిబ్రవరి 21వ తేదీన విడుదలైన భీష్మ సినిమా 4 రోజు కూడా అదే హంగామా కొనసాగించింది. మరి ఈ నాలుగు రోజుల్లో 'భీష్మ' కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దామా..

హై స్పీడ్‌లో పెళ్లికొడుకు.. భీష్మ హంగామా
రష్మిక చెప్పినట్లుగానే భీష్మ సినిమా రూపంలో నితిన్‌కి బాగా కలిసొచ్చింది. ఈ సినిమాతో తొలిరోజే సక్సెస్ టాక్ అందుకున్న ఈ పెళ్లికొడుకు 4 రోజు కూడా అదే కంటిన్యూ చేస్తూ హై స్పీడ్‌లో వెళుతున్నాడు. 4వ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ పెద్దగా కలెక్షన్స్ డ్రాప్ కాకపోవడం విశేషం.

సాలిడ్ వీకెండ్.. బ్లాక్‌బస్టర్ మూవీ
మొదటి వీకెండ్ సాలిడ్‌గా ముగించి బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది భీష్మ మూవీ. 4 వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సుమారుగా 50 నుంచి 60% వరకు డ్రాప్స్‌ని సొంతం చేసుకోగా, ఈవినింగ్ అండ్ నైట్ షోలకి వచ్చే సరికి సినిమా తిరిగి గ్రోత్‌ని సాధించి సత్తా చాటాడు భీష్మ.

ఈ 4 రోజుల్లో భీష్మ వసూళ్లు
4వ రోజు భీష్మ మూవీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల మేర వసూలు చేసింది. అదే వరల్డ్ వైడ్ చూస్తే 2.5 కోట్లు వసూలయ్యాయి. ఇక మొత్తంగా చూస్తే ఈ 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 16.71 కోట్లు కలెక్ట్ చేసిన భీష్మ.. ప్రపంచవ్యాప్తంగా 21.13 కోట్లు రాబట్టింది.

పెళ్ళికి ముందు నితిన్ బూస్ట్
తొలి రోజే భీష్మ సినిమా 6. 4 కోట్లు వసూలు చేసి ఇప్పటికీ ఆ స్పీడ్ తగ్గించడం లేదు. తొలిరోజు ఈ రేంజ్ వసూళ్లు రావడం నితిన్ కెరీర్ లో ఇదే ప్రథమం కావడం విశేషం. మొత్తానికి పెళ్ళికి ముందు నితిన్ ఈ సినిమాతో బాగా బూస్ట్ అయ్యాడనేది జనం టాక్.

ఓవర్సీస్ మార్కెట్‌లో భీష్మ
దేశంలోనే గాక ఓవర్సీస్ మార్కెట్ లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది భీష్మ. ఇప్పటికే అక్కడ 600K డాలర్స్ వసూళ్లు రాబట్టి 1 మిలియన్ డాలర్ దిశగా పరుగులు పెడుతోంది. నితిన్, రష్మిక రొమాన్స్ చూసి ఫిదా అవుతున్నారు ఓవర్సీస్ ఆడియన్స్.

బ్రేక్ ఈవెన్ స్పాట్.. టార్గెట్ దగ్గరలో
ఇకపోతే భీష్మ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. భీష్మ చిత్రం దాదాపు 23కోట్లకు అమ్ముడు పోగా.. 25కోట్ల షేర్‌ను రాబట్టే టార్గెట్‌తో దిగింది. ఇదే జోష్ కొనసాగిస్తే మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ ఖాయం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Recommended Video


భీష్మ మూవీ.. నితిన్ కెరీర్‌లో
నితిన్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందన్న నటించి మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఔట్ అండ్ ఔట్ కామెడీతో వెన్నెల కిషోర్ బాగా ఆకట్టుకున్నాడు. మొత్తానికి నితిన్ కెరీర్‌లో మరో మైలురాయి భీష్మ కానుందని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











