Don't Miss!
- News ఏపీకి మరో వరం ప్రకటించిన మోడీ
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
భీష్మ 5 రోజుల వసూళ్లు: బ్రేక్ ఈవెన్ రీచ్.. నితిన్ సత్తా అంటే ఇదే మరి!
నితిన్ లేటెస్ట్ మూవీ 'భీష్మ' బ్రేక్ ఈవెన్ రీచ్ అయి భారీ కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతోంది. వెంకీ కుడుముల టేకింగ్, నితిన్ కామెడీ టైమింగ్ ప్రేక్షకుల మనసు దోచుకోవడంతో కలెక్షన్ల ప్రవాహం సాగుతూనే ఉంది. ఈ మేరకు విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ క్రాస్ చేసింది భీష్మ. వివరాల్లోకి పోతే..
Recommended Video
5వ రోజు హవా.. వర్కింగ్ డే డ్రాప్స్
భీష్మ సినిమాతో 2020కి కిక్ స్టార్ట్ ఇచ్చిన నితిన్.. వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఫిబ్రవరి 21వ తేదీన విడుదలైన భీష్మ సినిమా 5వ రోజు కూడా అదే హంగామా కొనసాగించింది. వర్కింగ్ డే అయినప్పటికీ వసూళ్ళలో పెద్దగా డ్రాప్స్ కనిపించకపోవడం విశేషం.
సాలిడ్ వీకెండ్.. అదే జోష్
మొదటి వీకెండ్ సాలిడ్‌గా ముగించి బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతున్న భీష్మ మూవీ. 5వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు కొంతమేర డ్రాప్స్‌ని సొంతం చేసుకున్నప్పటికీ, ఈవినింగ్ అండ్ నైట్ షోలకి వచ్చే సరికి తిరిగి గ్రోత్‌ని సాధించింది. మొత్తంగా చూస్తే అన్ని ఏరియాల్లో 5వ రోజు కూడా భీష్మ హంగానే కనిపించింది.
5వ రోజు కలెక్షన్స్..
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5వ రోజుకు గాను 1. 5 కోట్ల మేర కాలేచ్ట్ చేసింది భీష్మ. ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.
మొత్తంగా ఈ 5 రోజుల్లో
ఇక మొత్తంగా ఈ 5 రోజుల్లో భీష్మ కలెక్షన్స్ చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 18.02 కోట్లు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా చూస్తే 23.73 కోట్లు కలెక్ట్ అయ్యాయి. దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది.
ఓవర్సీస్ మార్కెట్లో భీష్మ
దేశంలోనే గాక ఓవర్సీస్ మార్కెట్ లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది భీష్మ. ఇప్పటికే అక్కడ 600K డాలర్స్ వసూళ్లు రాబట్టి 1 మిలియన్ డాలర్ దిశగా పరుగులు పెడుతోంది. నితిన్, రష్మిక రొమాన్స్ చూసి ఫిదా అవుతున్నారు ఓవర్సీస్ ఆడియన్స్.
సంబరాల్లో నిర్మాతలు.. సక్సెస్ మీట్
కేవలం
5
రోజుల్లోనే
భీష్మ
ఈ
మేర
కలెక్షన్స్
రాబట్టడం,
బ్రేక్
ఈవెన్
క్రాస్
చేయడంతో
నిర్మాతలు
సంబరాలు
చేసుకుంటున్నారు.
ఈ
మేరకు
మంగళవారం
రోజు
చిత్రయూనిట్
అంతా
కలిసి
హైదరాబాద్
లో
గ్రాండ్
సక్సెస్
మీట్
నిర్వహించుకున్న
సంగతి
తెలిసిందే.
భీష్మ మూవీ.. వెన్నెల కిషోర్ కామెడీ
నితిన్ హీరోగా రూపొందిన భీష్మ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందన్న నటించి మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఔట్ అండ్ ఔట్ కామెడీతో వెన్నెల కిషోర్ బాగా ఆకట్టుకున్నాడు. మొత్తానికి నితిన్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది ఈ భీష్మ.