భీష్మ 6 డేస్ కలెక్షన్స్: రోజు రోజుకూ పరిస్థితి! మనోడి దూకుడు ఎలా ఉందో మీరే చూడండి..

యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ 'భీష్మ' బ్రేక్ ఈవెన్ రీచ్ అయి భారీ కలెక్షన్స్ దిశగా పరుగులు పెడుతోంది. డైరెక్టర్ వెంకీ కుడుముల టేకింగ్, నితిన్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో కలెక్షన్ల ప్రవాహం సాగుతూనే ఉంది. ఈ మేరకు విడుదలైన 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ క్రాస్ చేసిన భీష్మ.. 6 రోజు కూడా అదే హంగామా కొనసాగించింది. ఆ వివరాలేంటో చూద్దామా..

6వ రోజు భీష్మ.. డీసెంట్ కలెక్షన్స్

6వ రోజు భీష్మ.. డీసెంట్ కలెక్షన్స్

ఫిబ్రవరి 21వ తేదీన విడుదలైన భీష్మ సినిమా 6వ రోజు కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. వీక్ మిడిల్ వర్కింగ్ డే అయినప్పటికీ వసూళ్ళలో పెద్దగా డ్రాప్స్ కనిపించలేదు. మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు కొంతమేర డ్రాప్స్‌ని సొంతం చేసుకున్నప్పటికీ, ఈవినింగ్ అండ్ నైట్ షోలు ఆ లోటును పూడ్చేశాయి.

5వ రోజుతో పోల్చితే 6వ రోజు

5వ రోజుతో పోల్చితే 6వ రోజు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6వ రోజుకు గాను 1. 2 కోట్ల మేర వసూలు చేసింది భీష్మ. ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా చూస్తే 1. 5 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 5వ రోజుతో పోల్చితే పెద్దగా కలెక్షన్స్ లో డ్రాప్స్ కనిపించలేదు.

6 రోజుల్లో మొత్తంగా..

6 రోజుల్లో మొత్తంగా..

తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న భీష్మ మొదటి 5 రోజుల్లో 27.20 కోట్ల రూపాయలు వసూలు చేసి బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఇక ఆరో రోజు వసూళ్లు కూడా కలుపుకొని ఇప్పటికి 28.70 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేసింది.

Recommended Video

Nithiin’s Bheeshma Reaches Break-Even Mark in Just 5 Days || Filmibeat Telugu
 ఈ 6 రోజులు.. రోజు వారి రిపోర్ట్

ఈ 6 రోజులు.. రోజు వారి రిపోర్ట్

భీష్మ మూవీకి మొదటి రోజు 9.50 కోట్లు, రెండవ రోజు 6.50 కోట్లు, మూడవ రోజు 6.70 కోట్లు, నాలుగో రోజు 2.60, ఐదో రోజు 1.90 కోట్లు, ఆరవ రోజు 1.50 కోట్లు వసూలయ్యాయి.

మొత్తంగా చూస్తే.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్

మొత్తంగా చూస్తే.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్

ఈ 6 రోజుల్లో దేశవ్యాప్తంగా 28.70 కోట్ల రూపాయలు రాబట్టిన భీష్మ, వరల్డ్ వైడ్ గా చూస్తే 41.30 కోట్లు కొల్లగొట్టింది. 6 రోజుకు గాను ఓవర్సీస్ లో 8 కోట్లు రాబట్టింది.

 సంబరాల్లో నిర్మాతలు.. సక్సెస్ మీట్

సంబరాల్లో నిర్మాతలు.. సక్సెస్ మీట్

కేవలం 5 రోజుల్లోనే భీష్మ ఈ మేర కలెక్షన్స్ రాబట్టడం, బ్రేక్ ఈవెన్ క్రాస్ చేయడంతో నిర్మాతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మేరకు మంగళవారం రోజు చిత్రయూనిట్ అంతా కలిసి హైదరాబాద్ లో గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించుకుంది.

భీష్మ మూవీ.. వెన్నెల కిషోర్ కామెడీ

భీష్మ మూవీ.. వెన్నెల కిషోర్ కామెడీ

నితిన్ హీరోగా రూపొందిన భీష్మ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందన్న నటించి మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఔట్ అండ్ ఔట్ కామెడీతో వెన్నెల కిషోర్ బాగా ఆకట్టుకున్నాడు. మొత్తానికి నితిన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది ఈ భీష్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X