Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Bheeshma box office collections: తొమ్మిదో రోజూ కుమ్మేసిన భీష్మ.. ఇప్పటి వరకు వచ్చిన లాభమెంతంటే..?
నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్లో వచ్చిన చిత్రం భీష్మ. నాలుగేళ్లుగా హిట్ కోసం పరితపించిన నితిన్.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. కొత్తగా ప్రయత్నిస్తూ వచ్చిన నితిన్‌కు నిరాశే ఎదురవ్వగా.. పక్కా కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కించిన భీష్మ.. వసూళ్లలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. నితిన్ కెరీర్లో సూపర్ డూపర్ హిట్‌గా నిలవబోతోంది.
ఆగని వసూళ్లు..
భీష్మ థియేటర్లలోకి వచ్చే సమయానికి గట్టి పోటినిచ్చే సినిమా లేకపోవడం నితిన్‌కు కలిసి వచ్చింది. దీంతో వారం మొత్తం భీష్మ హవానే నడిచింది. ఇక రెండో వారంలోనూ పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో మరింత పుంజుకునే అవకాశం ఉంది.
తొమ్మిదో రోజు ఎంత రాబట్టిందంటే..?
భీష్మ తొమ్మిదో రోజు ఏ ఏరియాల్లో ఎంత కొల్లగొట్టిందో ఓ సారి చూద్దాం. నైజాంలో 16లక్షలు, సీడెడ్‌లో 8 లక్షలు, ఉత్తరాంద్రలో 10లక్షలు, ఈస్ట్ 5లక్షలు, వెస్ట్ 4లక్షలు, గుంటూరు 5లక్షలు, కృష్ణా 6లక్షలు, నెల్లూరు 3లక్షలు ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 0.57కోట్లు కొల్లగొట్టింది.
ఒక్కో రోజు ఎంత వసూల్ చేసిందంటే..?
మొదటి రోజు 6.42కోట్లు కొల్లగొట్టిన భీష్మ.. రెండో రోజు 4.27కోట్ల మేర రాబట్టింది. మూడో రోజు 4.31కోట్లు, నాల్గో రోజు 1.71కోట్లు, ఐదో రోజు 1.22కోట్లు, ఆరో రోజు 81లక్షలు, ఏడో రోజు 43లక్షలు, ఎనిమిదో రోజు 38లక్షలు, తొమ్మిదో రోజు 57లక్షలు కొల్లగొట్టింది.
ఇప్పటికే ఎంత లాభం వచ్చిందంటే..?
భీష్మ చిత్రాన్ని అన్ని లెక్కలను కలుపుకుంటే.. 17.85కోట్లకు అమ్ముడు పోయినట్టు టాక్. అయితే ఇప్పటికే లాభాల బాట పట్టేసింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే.. 20.12కోట్లు కొల్లగొట్టగా.. ఇప్పటికీ 2.27కోట్లు లాభాలు వచ్చాయని తెలుస్తోంది. ఇంకా లాంగ్ రన్ పూర్తయ్యే సరికి మరింత నిర్మాత జేబులోకి చేరే అవకాశం ఉంది.