Bheeshma World Wide Day 2 Collections : రెండో రోజూ కుమ్మేసిన భీష్మ.. ఏ రేంజ్‌లో వసూళ్లు చేసిందంటే..
యంగ్ హీరో నితిన్, రష్మిక మందాన్న కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం భీష్మ. ఛలో వంటి భారీ హిట్ కొట్టిన వెంకీ కుడుముల చేసిన రెండో ప్రయత్నం భీష్మ. ఏ ఆటంకం లేకుండా ద్వితీయ విఘ్నాన్ని దాటుకుని సూపర్ హిట్ కొట్టేశాడు. ఎన్నాళ్ల నుంచి ఓ హిట్ కోసం ఎదురుచూసిన నితిన్ ఆశలు నెరవేరాయి. హిట్ కావాలని అనుకున్న నితిన్‌కు బ్లాక్ బస్టర్ హిట్ దొరికేలా ఉంది.

సంబరాల్లో యూనిట్..
భీష్మ మొదటి రోజు మొదటి ఆటకే యునానిమస్ టాక్ రావడంతో.. అక్కడి నుంచే వసూళ్లు పెరగడం ప్రారంభించాయి. ఫస్ట్ షో, సెకండ్ షోలకు హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి. దీంతో వసూళ్లలో భారీ తేడా కనిపించింది. మొదటి రోజే దాదాపు ఆరు కోట్లు కొల్లగొట్టి భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. దీంతో చిత్రయూనిట్ సంబరాల్లో మునిగి తేలింది.

మొదటి రోజు ఏ ఏరియాలో ఎంతంటే..?
భీష్మ మొదటి రోజు దాదాపు 6 కోట్లు కొల్లగొట్టగా.. నైజాంలో 2.2కోట్లు, సీడెడ్‌లో 0.8కోట్లు, వైజాగ్‌లో 0.62కోట్లు, గుంటూరు 0.77కోట్లు, ఈస్ట్ 0.66కోట్లు, వెస్ట్ 0.56కోట్లు, కృష్ణా 0.4కోట్లు, నెల్లూరు 0.27కోట్లు ఇలా మొత్తంగా 6.28కోట్లను కొల్లగొట్టింది.

ప్రపంచవ్యాప్తంగా..
ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.28కోట్లు కొల్లగొట్టిన భీష్మ... ఓవర్సీస్‌లోనూ బాగానే రాబట్టినట్టు తెలుస్తోంది. రెస్టాప్ ఇండియా, ఓవర్సీస్ ఇలా ఈ లెక్కలన్నీ కలిసి మొత్తంగా మొదటి రోజు 8కోట్లకు పైగా రాబట్టినట్టు తెలుస్తోంది.

రెండో రోజూ అదే స్పీడ్..
మొదటే రోజే సినిమాకు ఒకేరకమైన టాక్ రావడం, ఆ పాజిటివ్ టాక్‌తోనే కలెక్షన్లు పెరగడం, శివరాత్రి, వీకెండ్ ఇలా అన్నీ కలసి రావడం భీష్మకు భారీగా కలిసి వచ్చింది. దీంతో మొదటి రోజు వసూళ్లకు ధీటుగా రెండో రోజూ కొల్లగొట్టింది. రెండో రోజు భీష్మ ఇండియాలో దాదాపు 5.30కోట్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. అదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 8.10కోట్లు అని సమాచారం.

మొత్తం రెండు రోజుల్లో..
భీష్మ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రోజుల్లోనే భీష్మ 12.80కోట్ల షేర్‌ను, 19.30కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్టు తెలుస్తోంది. భీష్మ చిత్రం దాదాపు 23కోట్లకు అమ్ముడు పోగా.. 25కోట్ల షేర్‌ను రాబట్టే టార్గెట్‌తో దిగింది. రెండో రోజుతోనే దాదాపు సగం రాబట్టేసింది. ఇదే రోజును కొనసాగిస్తే మరో రెండు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











