Bheeshma First Day Collections : దుమ్ములేపిన భీష్మ.. మొదటి రోజే షాకింగ్ కలెక్షన్స్

కొత్తగా ట్రై చేస్తూ వస్తూ ఉన్నా.. తీసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతున్నా ఏ మాత్రం నిరాశ చెందకుండా పట్టు పదలతో ప్రయత్నిస్తూ వచ్చాడు యంగ్ హీరో నితిన్. హిట్టు కొట్టాలన్న అతని తపన ఎట్టకేలకు భీష్మ చిత్రంతో నెరవేరింది. చాలా రోజుల తరువాత సరైన కమర్షియల్ కథను ఎంచుకుని మంచి విజయాన్ని అందుకున్నాడని టాక్ వచ్చింది. విమర్శకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓవరాల్‌గా భీష్మ టాక్ పరంగా పాస్ అయిపోయింది. ఇక బాక్సాఫీస్ లెక్కలే భీష్మ భవిత్యవాన్ని చెబుతాయి. ఈ క్రమంలో మొదటి రోజు భీష్మ దుమ్ములేపేశాడని తెలుస్తోంది. ఆ వివరాలేంటోఓ సారి చూద్దాం.

 సరైన ప్రమోషన్స్‌తో..

సరైన ప్రమోషన్స్‌తో..

భీష్మ చిత్రానికి సరైన ప్రమోషన్స్ చేసి జనాల్లోకి వెళ్లేట్టు చేశారు. ఫస్ట్ గ్లింప్స్ అంటూ నితిన్-రష్మిక మధ్య కెమిస్ట్రీని హైలెట్ చేయడం, టీజర్, పాటలతో సినిమాపై అంచనాలు పెరిగేలా చేయడంలో చిత్రయూనిట్ సక్సెస్ అయింది. ఇలా విడుదలకు ముందే భీష్మపై బజ్ క్రియేట్ అయింది.

మొదటి ఆట నుంచే పాజిటివ్..

మొదటి ఆట నుంచే పాజిటివ్..

భీష్మ విషయంలో మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. కథ కొత్తది కాకపోయినా.. ఆద్యంతం వినోదభరితంగా ఉండటం, పంచ్ డైలాగ్స్, పాటలు, డ్యాన్సులు, ఇలా కమర్షియల్ చిత్రానికి కావాల్సిన హంగులన్నీ ఉన్నాయని టాక్ రావడంతో ఫస్ట్ షో, సెకండ్ షో వరకు బుకింగ్ శాతం ఓ రేంజ్‌లో పెరిగిందని తెలుస్తోంది.

శివరాత్రి కావడంతో..

శివరాత్రి కావడంతో..

శివరాత్రి కావడంతో మిడ్ నైట్ షోలు కూడా వేశారని తెలుస్తోంది. అలా వేసిన షోలు కూడా హౌస్‌ఫుల్ అయ్యాయని టాక్. ఇలా మొదటి ఆటకు 40శాతం ఉన్న ఆక్యుపెన్సీ ఫస్ట్ షో, సెకండ్ షో వరకు దాదాపు 60శాతం వరకు పెరిగిందట. ఈ లెక్కన భీష్మ భారీ ఎత్తున కొల్లగొట్టినట్టు తెలుస్తోంది.

Recommended Video

Bheeshma Movie Public Talk | Venky Kudumula | Nithin | Rashmika Mandanna | Filmibeat Telugu
కెరీర్ హయ్యస్ట్ ఓపెనింగ్స్..

కెరీర్ హయ్యస్ట్ ఓపెనింగ్స్..

మరే చిత్రం కూడా పోటీలో లేకపోవడంతో దాదాపు థియేటర్లన్నీ భీష్మతోనే నిండిపోయాయని సమాచారం. ఈ లెక్కన రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు భీష్మ.. దాదాపు 5.5 కోట్ల నుంచి ఆరు కోట్ల మధ్య వసూళ్లు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి పూర్తి లెక్కలు తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X