Bhimaa Day 2 Collections బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా భీమా.. గోపిచంద్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

టాలీవుడ్ స్టార్ హీరో గోపిచంద్ ద్విపాత్రాభినయంతో నటించిన తాజా చిత్రం భీమా. పరుశురాముడి కథా నేపథ్యంతో పౌరాణిక, సాంఘీక అంశాలను జోడించి రూపొందించిన ఈ చిత్రానికి కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

భీమా సినిమా విషయానికి వస్తే రాముడు, భీముడు అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య సాగే ఎమోషనల్ కథ. భీముడు పోలీస్ ఆఫీసర్‌గా, రాముడు పూజారీ పాత్రలో నటించారు. ఈ సినిమాకు తొలి రోజు మిక్స్‌డ్ టాక్ రావడంతో మొదట స్లోగా కలెక్షన్లు స్లోగా మొదలయ్యాయి. అయితే శివరాత్రి పండుగ కావడంతో ఫస్ట్, సెకండ్ షోలు ఊపందుకొన్నాయి.

bhimaa-day-2-box-office-Report

ఇక భీమా సినిమాను సుమారుగా 30 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాకు 21 కోట్ల రూపాయలుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా విలువకట్టారు. ఇక సినిమా మంచి ప్రీ రిలీజ్ టాక్ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా నైజాం, ఆంధ్రాలో కలిపి 600 స్కీన్లలో, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో 100 స్క్రీన్లకుపైగా, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లలో కలిపి మొత్తంగా 900 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

భీమా చిత్రం తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. గోపిచంద్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లలో ఒకటిగా నిలిచింది. ఇండియాలో 3 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు 4 కోట్లకుపైగానే కలెక్షన్లను రాబట్టింది.

ఇక రెండో రోజు కూడా ఈ మూవీ నిలకడగా వసూళ్లను రాబట్టే ప్రయత్నం చేసింది. ఈ సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. ఓవరాల్‌గా 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అత్యధికంగా వరంగల్‌లో 50 శాతం, కరీంనగర్‌లో 65 శాతం, వైజాగ్‌లో 40 శాతం, మిగితా ప్రాంతాల్లో 30 శాతం కంటే తక్కువగా ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది.

2వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. బాక్సాఫీస్ వద్ద ఇతర సినిమాల పోటీ తట్టుకొని స్ట్రాంగ్‌గా కనిపించింది. ఈ సినిమా రెండో రోజు 2 కోట్ల రూపాయల లోపు వసూళ్లను సాధించే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X