Bhimaa Collections 30 కోట్ల బడ్జెట్‌తో భీమా.. గోపిచంద్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

మాచో స్టార్ గోపిచంద్ హీరోగా మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష రూపొందించిన చిత్రం భీమా. ప్రముఖ నిర్మాత కేకే రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్, ముఖేష్ తివారీ, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, వీకే నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇలాంటి విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా మార్చి 8వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

పురాణాల్లో పరుశురాముడి కథా నేపథ్యంగా తెరకెక్కిన పోలీస్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ భీమా. ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఉండటంతో గోపిచంద్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే థియేటర్‌లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమా ఏ రేంజ్‌లో కలెక్షన్లు రాబడుతుందనే ఆసక్తి పెరిగింది.

Bhimaa Expected Box Office Collections worldwide Gopichand Movie starts moderate at Global Box Office

ఇక భీమా సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో భారీ తారాగాణం ఉండటం, అలాగే టాప్ టెక్నిషియన్స్ కూడా పనిచేయడంతో రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను 30 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా 25 కోట్ల రూపాయలను సెట్ చేశారు. దాంతో ఈ సినిమాను భారీగానే రిలీజ్ చేశారు.

భీమా సినిమాకు రిలీజ్‌కు ముందు మంచి బజ్ కనిపించడంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను గోపిచంద్ కెరీర్‌లో హయ్యెస్ట్ స్క్రీన్లలో రిలీజ్ చేశారు. నైజాం, ఆంధ్రాలో కలిపి 600 స్కీన్లలో, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో 100 స్క్రీన్లకుపైగా, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లలో కలిపి మొత్తంగా 900 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Bhimaa Expected Box Office Collections worldwide Gopichand Movie starts moderate at Global Box Office

భీమా సినిమా పాజిటివ్ ఓపెన్సింగ్స్ బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది. ఈ చిత్రానికి 40 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. హైదరాబాద్‌లో 40 శాతం, విజయవాడలో 30 శాతం, వరంగల్‌‌లో 55 శాతం, గుంటూరు, వైజాగ్‌లో 35 శాతం, కరీంనగర్‌లో 55 శాతం, మహబూబ్ నగర్‌లో 50 శాతం, కాకినాడలో 40 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

ఇక ఓవర్సీస్‌‌లో గోపిచంద్ మూవీకి మంచి ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉంది. ఈ సినిమా యూఎస్ఏ, ఇతర ప్రాంతాల్లో కలిపి 1.25 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఏపీ, తెలంగాణలో కలిపి ఈ చిత్రం 2.35 కోట్లు నికరంగా కలెక్ట్ చేస్తుందని పేర్కొన్నారు. కర్ణాటక ఇతర ప్రాంతాలల్లో కలిపి మొత్తంగా ఈ సినిమా తొలి రోజు 3.5 కోట్లు నికరంగా, 4.5 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. అవకాశం ఉంది. గతంలో వచ్చిన రామబాణం చిత్రం డే 1 రోజున 2.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

ఇక రెండో రోజు కూడా భీమా బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా ఓవర్సీస్, తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 6 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది.

భీమా చిత్రం 3వ రోజు కూడా నిలకడగా కనిపించింది. కానీ ఆదివారం రోజున రాబట్టాల్సిన కలెక్షన్లు సాధించలేకపోయింది. ఈ సినిమా తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో కలిపి సుమారుగా 1.75 కోట్ల నికరంగా రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 7.75 కోట్లు రాబట్టింది.

ఇక గోపిచంద్ చిత్రం సోమవారం అంటే 4వ రోజున ఈ చిత్రం 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత ఐదో రోజు 80 లక్షల రూపాయలు, ఆరో రోజు 55 లక్షల రూపాయలు, ఏడో రోజు 60 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తెలుగు, కన్నడ రాష్ట్రాలతో కలిపి మొత్తం 9.5 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక ఈ సినిమా ఎనిమిదో రోజు పేలవమైన వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం 40 లక్షల రూపాయలు వసూళ్లను సాధించింది. దాంతో ఇండియాలో 10 కోట్ల రూపాయల నికర వసూళ్లను కలెక్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X