Bhola Shankar: చిరంజీవి మూవీకి షాక్.. ఆ నిర్ణయమే కొంప ముంచిది.. అక్కడ మాత్రం రికార్డు బ్రేక్

రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ హీరో చేయని విధంగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి. ఏడాదికి కనీసం రెండు సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటోన్న ఆయన.. ఈ సంవత్సరం 'వాల్తేరు వీరయ్య'తో వచ్చి సెన్సేషనల్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. అదే ఊపులో ఇప్పుడు చిరంజీవి 'భోళా శంకర్' అనే సినిమాను చేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈరోజే (ఆగస్టు 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బుకింగ్స్ లెక్కలను ఓ సారి చూద్దాం పదండి!

భోళా శంకర్‌గా వచ్చిన చిరు:మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రమే 'భోళా శంకర్'. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించింది. అలాగే, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను, హైపర్ ఆదిలు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు.

Bhola Shankar Beats Jailer In Hyderbad City In Advance Booking

అడ్వాన్స్ బుకింగ్స్ తక్కువే:ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'భోళా శంకర్' సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో దీన్ని ఆగస్టు 11న ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. చాలా ప్రాంతాల్లో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్‌ను మొదలు పెట్టగా.. గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడు అయిపోయాయి. తెలుగులో మాత్రం దీనికి ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు.

తెలంగాణలో పర్వాలేదుగా:'భోళా శంకర్' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో సాధారణ రెస్పాన్స్‌ను అందుకుంది. ముఖ్యంగా ఖమ్మంలో 65%, వరంగల్‌లో 54%, కరీంనగర్‌లో 36%, నిజామాబాద్‌లో 28%, మహబూబ్‌నగర్‌లో 31%, కోదాడలో 28%, మిర్యాలగూడలో 49%, సిద్దిపేటలో 21%, కామారెడ్డిలో 28%, అదిలాబాద్‌లో 29%, సిరిసిల్లలో 12% మాత్రమే బుకింగ్స్ అయ్యాయి.

Bhola Shankar Beats Jailer In Hyderbad City In Advance Booking

ఆంధ్రాలోనూ అదే రీతిలో:ఆంధ్రాలోనూ 'భోళా శంకర్'కు తక్కువ టికెట్లే బుక్ అయ్యాయి. ముఖ్యంగా రాజమండ్రిలో 84%, తిరుపతిలో 64%, నెల్లూరులో 80%, ఒంగోలులో 41%, విజయనగరంలో 84%, ఏలూరులో 89%, గుంటూరులో 59%, కాకినాడలో 92%, కడపలో 29%, వైజాగ్‌లో 74%, విజయవాడలో 71% మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. ఇది చిరంజీవి రేంజ్‌కు చాలా తక్కువ అని అంటున్నారు.

Bhola Shankar Beats Jailer In Hyderbad City In Advance Booking

వాళ్ల నిర్ణయం వల్లే ఇలా?:వాస్తవానికి చిరంజీవి సినిమా ఎప్పుడు వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం కంటే ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతూ ఉంటాయి. కానీ, 'భోళా శంకర్' టీమ్ టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి చేసిన ప్రాసెస్ వల్ల టికెట్ బుకింగ్స్ ఆలస్యంగా ఓపెన్ అయ్యాయి. ఈ ప్రభావం మొదటి రోజు బుకింగ్స్ మీద చూపించింది. అందుకే ఇంత తక్కువగా టికెట్లు బుక్ అయ్యాయి.

Bhola Shankar Beats Jailer In Hyderbad City In Advance Booking

హైదరాబాద్‌లో రికార్డు బ్రేక్:'భోళా శంకర్' సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఆశించిన స్థాయిలో స్పందనను అందుకోవడం లేదనే చెప్పాలి. అయితే, హైదరాబాద్‌ నగరంలో మాత్రం ఈ సినిమాకు 501 షోలకు గానూ 53 శాతం బుకింగ్స్ అయ్యాయి. దీంతో దీనికి రూ. 2.33 కోట్లు గ్రాస్ వసూలు అయింది. దీంతో 'జైలర్' రికార్డు (2.20 కోట్లు)ను ఇది బ్రేక్ చేసేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X