Bhola Shankar 2 Days Collections: 2వ రోజే మైండ్ బ్లాక్ వసూళ్లు.. చిరంజీవి మూవీకి ఇలానా.. దారుణం సామీ
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నలభై ఏళ్లుగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మధ్య కాలంలో ఆయన రాకెట్ వేగంతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్నారు.
ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలను అందించిన ఆయన.. ఇప్పుడు 'భోళా శంకర్' అనే చిత్రంతో వచ్చారు. అయితే, దీనికి మిక్స్‌డ్ టాక్ రావడంతో వసూళ్లు అంతగా రావట్లేదు. రెండో రోజు దారుణంగా డౌన్ అయిపోయింది. మరి.. 'భోళా శంకర్' 2 రోజుల్లో మొత్తం వసూళ్లను ఓ సారి చూసేయండి!

భోళా శంకర్‌గా చిరు ఎంటర్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించిన సినిమానే 'భోళా శంకర్'. ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించింది. అలాగే, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను, హైపర్ ఆదిలు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. మహతి స్వర సాగర్ దీనికి మ్యూజిక్ అందించాడు.
భోళా శంకర్ బిజినెస్ డీటేల్స్: సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చిన 'భోళా శంకర్' మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 12 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.60 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.60 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.60 కోట్లు బిజినెస్ జరుపుకుంది.

2వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా
'భోళా శంకర్'కి ఆంధ్రా, తెలంగాణలో 2వ రోజు రెస్పాన్స్ తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 1.13 కోట్లు, సీడెడ్‌లో రూ. 50 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 55 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 24 లక్షలు, కృష్ణాలో రూ. 21 లక్షలు, నెల్లూరులో రూ. 17 లక్షలతో కలిపి.. రూ. 3.13 కోట్లు షేర్, రూ. 5.25 కోట్లు గ్రాస్ వచ్చింది.
2వ రోజులకు కలిపి ఎంతంటే
'భోళా శంకర్'కి ఏపీ, తెలంగాణలో 2 రోజుల్లో తక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 5.64 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.52 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.39 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.53 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.97 కోట్లు, గుంటూరులో రూ. 2.32 కోట్లు, కృష్ణాలో రూ. 1.24 కోట్లు, నెల్లూరులో రూ. 90 లక్షలతో కలిపి.. రూ. 18.51 కోట్లు షేర్, రూ. 27.45 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
2 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 18.51 కోట్లు రాబట్టిన 'భోళా శంకర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ అంతగా రాణించడం లేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.12 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 2 రోజుల్లో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.98 కోట్లు షేర్, రూ. 34.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'భోళా శంకర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 80.50 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 21.98 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 58.52 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.
అజ్ఞాతవాసి, బ్రహ్మోత్సవం
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' మూవీ రెండో రోజే దారుణమైన వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది కేవలం రూ. 3.13 కోట్లు మాత్రమే వసూలు చేసింది. తద్వారా రెండో రోజు తక్కువ వసూళ్లు రాబట్టిన భారీ చిత్రాల లిస్టులో 2వ స్థానానికి చేరింది. ఇందులో బ్రహ్మోత్సవం రూ. 3.10 కోట్లతో ఫస్ట్ ఉండగా.. అజ్ఞాతవాసి 3.75 కోట్లతో 3వ స్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications











