Bhola Shankar 4 Days Collections: 4వ రోజు ఢమాల్.. భోళాకు దిమ్మతిరిగే షాక్.. ఏ స్టార్‌కూ ఇలా జరగలేదు!
బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చినా.. తనదైన టాలెంట్లతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని టాలీవుడ్‌ను ఏలుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మధ్య కాలంలో మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తోన్న ఆయన.. ఈ ఏడాది ఆరంభంలో 'వాల్తేరు వీరయ్య'తో బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు.
ఈ ఊపులతోనే ఇటీవల 'భోళా శంకర్' అనే చిత్రంతో వచ్చారు. కానీ, దీనికి ఆశించిన రీతిలో స్పందన రావట్లేదు. ఫలితంగా ఈ మూవీ కలెక్షన్లను అంతగా రాణించడం లేదు. ఇలా 4వ రోజు బాగా డౌన్ అయింది. మరి 'భోళా శంకర్' వసూళ్లను మీరే చూసేయండి!

భోళా శంకర్ వచ్చేశాడుగా: మెగాస్టార్ చిరంజీవి - మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కిన సినిమానే 'భోళా శంకర్'. ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించింది. అలాగే, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను, హైపర్ ఆదిలు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. మహతి స్వర సాగర్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు.

భోళా శంకర్ బిజినెస్ డీటేల్స్: మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'భోళా శంకర్' మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 12 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.60 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.60 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.60 కోట్లు బిజినెస్ చేసుకుంది.

4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా: సిస్టర్ సెంటిమెంట్‌తో ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'భోళా శంకర్' మూవీకి వర్కింగ్ డే అయిన సోమవారం బిగ్ షాక్ తగిలింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తేలిపోయింది. ఫలితంగా ఆదివారం రూ. 3.17 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. సోమవారం అతి దారుణంగా రూ. 25 లక్షలకే పరిమితం అయింది. తద్వారా దిమ్మతిరిగే షాక్‌కు ఎదుర్కొంది.

4వ రోజులకు కలిపి ఎంతంటే: 'భోళా శంకర్'కి ఏపీ, తెలంగాణలో 4 రోజుల్లో దారుణమైన స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 6.55 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.05 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.82 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.14 కోట్లు, గుంటూరులో రూ. 2.60 కోట్లు, కృష్ణాలో రూ. 1.54 కోట్లు, నెల్లూరులో రూ. 1.13 కోట్లతో కలిపి.. రూ. 21.93 కోట్లు షేర్, రూ. 33.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: 4 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 21.93 కోట్లు రాబట్టిన 'భోళా శంకర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ అంతగా రాణించడం లేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.18 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 4 రోజుల్లో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.76 కోట్లు షేర్, రూ. 40.80 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: పక్కా కమర్షియల్ సబ్జెక్టుతో వచ్చిన 'భోళా శంకర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 80.50 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి రూ. 25.76 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 54.74 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

ఏ స్టార్ హీరోకూ జరగలేదు: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' మూవీకి మొదటి నుంచీ ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. పైగా సోమవారం అతి దారుణంగా దీనికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 25 లక్షలు షేర్ మాత్రమే లభించింది. నాలుగో రోజే ఇంత తక్కువ వసూళ్లు ఈ మధ్య కాలంలోనూ ఏ స్టార్ హీరో సినిమాకూ రాలేదు. దీంతో చిరంజీవికి ఇది పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications











