Bhola Shankar 5 Days Collections: హాలీడే ఉన్నా షాకే.. 5 రోజుల్లో దారుణం.. అన్ని కోట్లు నష్టాల దిశగా!
తెలుగు చిత్ర సీమలోకి సపోర్టు లేకుండానే వచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్‌తో తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడని ఆయన.. దాదాపు నలభై ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు.
ఈ మధ్య కాలంలో మరింత స్పీడ్ పెంచిన చిరు.. ఇటీవలే 'భోళా శంకర్' మూవీతో వచ్చారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు షాక్ ఇచ్చారు. ఫలితంగా ఇది ఆశించిన రీతిలో వసూళ్లు రాబట్టడం లేదు. మరి 'భోళా శంకర్' మూవీ 5 రోజుల రిపోర్టును మీరే చూడండి!

భోళా శంకర్‌గా చిరంజీవి రాక: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన సినిమానే 'భోళా శంకర్'. ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించింది. అలాగే, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను, హైపర్ ఆదిలు కీలక పాత్రలు చేశారు. మహతి స్వర సాగర్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు.

భోళా శంకర్ బిజినెస్ డీటేల్స్: తమిళ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన 'భోళా శంకర్' మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 12 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.60 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.60 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.60 కోట్లు బిజినెస్ జరుపుకుంది.

5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 'భోళా శంకర్'కి ఆంధ్రా, తెలంగాణలో 5వ రోజు రెస్పాన్స్ కాస్త పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 36 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో కలిపి.. రూ. 95 లక్షలు షేర్, రూ. 1.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

5వ రోజులకు కలిపి ఎంతంటే: 'భోళా శంకర్'కి ఏపీ, తెలంగాణలో 5 రోజుల్లో దారుణమైన స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 6.91 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.24 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.18 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.90 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.19 కోట్లు, గుంటూరులో రూ. 2.67 కోట్లు, కృష్ణాలో రూ. 1.61 కోట్లు, నెల్లూరులో రూ. 1.18 కోట్లతో కలిపి.. రూ. 22.88 కోట్లు షేర్, రూ. 34.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రా, తెలంగాణలో 5 రోజుల్లో రూ. 22.88 కోట్లు రాబట్టిన 'భోళా శంకర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ అంతగా రాణించడం లేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 5 రోజుల్లో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 26.88 కోట్లు షేర్, రూ. 42.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందిన 'భోళా శంకర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 80.50 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 26.88 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 53.62 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

అన్ని కోట్లు నష్టాలు దిశగానే: మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'భోళా శంకర్' మూవీకి మొదటి నుంచీ ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. పైగా మంగళవారం హాలీడే ఉన్నా పెద్దగా రాణించలేదు. దీంతో ఈ చిత్రం మనుగడ ప్రమాదకరంగా మారిపోయింది. ఇదే కంటిన్యూ అయితే దీనికి రూ. 50 కోట్లు వరకూ నష్టాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











