Bhola Shankar 6 Days Collections: మరో కోలుకోలేని దెబ్బ.. 6 రోజుల్లో అన్ని కోట్లే.. ఇంకా అంత రావాలా!

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరు ఒక సంచలనం. అంతలా ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌ను ఏలుతున్నారు. అదే సమయంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే గత సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో బిగ్ హిట్ కొట్టారు. ఇక, ఇటీవలే చిరు 'భోళా శంకర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ, దీనికి మాత్రం అంతగా రెస్పాన్స్ రావడం లేదు. దీంతో వసూళ్లు దారుణంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'భోళా శంకర్' ఆరు రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి మరి!

భోళా శంకర్‌‌గా వచ్చిన చిరంజీవి:మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రమే 'భోళా శంకర్'. మెహర్ రమేష్ రూపొందించిన ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటించింది. అలాగే, కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను, హైపర్ ఆదిలు కీలక పాత్రలు చేశారు. మహతి స్వర సాగర్ దీనికి సంగీతం ఇచ్చాడు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు.

Bhola Shankar Movie 6 Days Official Box Office Collections

భోళా శంకర్ బిజినెస్ డీటేల్స్:సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చిన 'భోళా శంకర్' మూవీకి నైజాంలో రూ. 22 కోట్లు, సీడెడ్‌లో రూ. 12 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.60 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 67.60 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.60 కోట్లు బిజినెస్ చేసుకుంది.

Bhola Shankar Movie 6 Days Official Box Office Collections

6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా:'భోళా శంకర్'కి ఆంధ్రా, తెలంగాణలో 6వ రోజు రెస్పాన్స్ బాగా తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 20 వేలు, సీడెడ్‌లో రూ. 1.80 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 70 వేలు, గుంటూరులో రూ. 30 వేలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 10 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

6వ రోజులకు కలిపి ఎంతంటే:'భోళా శంకర్'కి ఏపీ, తెలంగాణలో 6 రోజుల్లో తక్కువ స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 6.91 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.26 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.21 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.97 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.20 కోట్లు, గుంటూరులో రూ. 2.67 కోట్లు, కృష్ణాలో రూ. 1.63 కోట్లు, నెల్లూరులో రూ. 1.19 కోట్లతో కలిపి.. రూ. 23.04 కోట్లు షేర్, రూ. 35.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

Bhola Shankar Movie 6 Days Official Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రా, తెలంగాణలో 6 రోజుల్లో రూ. 23.04 కోట్లు రాబట్టిన 'భోళా శంకర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ అంతగా రాణించడం లేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.84 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 6 రోజుల్లో దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.08 కోట్లు షేర్‌, రూ. 43.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

Bhola Shankar Movie 6 Days Official Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:సిస్టర్‌ సెంటిమెంట్‌తో రూపొందిన 'భోళా శంకర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 80.50 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 27.08 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 53.42 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Bhola Shankar Movie 6 Days Official Box Office Collections

అన్ని కోట్లు నష్టాలు దిశగానే:మెహర్ రమేష్ - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో రూపొందిన 'భోళా శంకర్' మూవీకి మొదటి నుంచీ ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. దీంతో ఈ చిత్రం మనుగడ కష్టంగా మారిపోయింది. ఇదే కంటిన్యూ అయితే దీనికి రూ. 52 కోట్లు వరకూ నష్టాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X